AP TET Resultse : టెట్ పరీక్ష ఫలితాలు విడుదల

AP TET Resultse : టెట్ పరీక్ష ఫలితాలు విడుదల
X

ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలను ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. అక్టోబర్ 3 నుంచి 21 వరకు రోజుకు రెండు సెషన్ల చొప్పున ఉన్నత విద్యా శాఖ టెట్‌ పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షకు మొత్తం 3 లక్షల 68 వేల 661 మంది హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్ష రాసేందుకు 4 లక్షల 27 వేల 300 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 1లక్ష 87వేల 256 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లుగా అధికారులు వెల్లడించారు. అయితే, డీఎస్సీ లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. మొత్తంగా టెట్ ఫలితాల్లో 50.79 శాతం మంది అర్హత సాధించారు.

Tags

Next Story