అక్కను రక్షించి..అసువులు బాసిన చిన్నారి తమ్ముడు

అక్కను రక్షించి..అసువులు బాసిన చిన్నారి తమ్ముడు
బాలుడిపై పెట్రోలు పోసి తగలబెట్టిన రాక్షసులు

మమ్మల్ని క్షమించు నిన్ను కాపాడుకోలేక పోయాం.ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మనుసున్న వాళ్లు ఎవరైనా అంటున్న మాట.తన సోదరిని వేధించవద్దన్నందుకు దుర్మార్గుల చేతిలో సజీవ దహనమైన చిన్నారి అమర్నాధ్ ను చూసి చలించని మనిషి లేడు.కాలిన గాయాలతో చావు బతుకుల మధ్య ఉన్న అమర్​నాథ్ తన మరణవాంగ్మూలంలో తనపై ఆ అఘాయిత్యానికి పాల్పడిన వారి గురించి పోలీసులకు తెలిపిన తీరు ఒళ్లు గగుర్పాటు గురి చేస్తుంది.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఇక చిన్నతనంలోనే ఆ చిన్నారి తండ్రిని కోల్పోయాడు.ఇంటి బాధ్యతలు తీసుకున్నాడు. తన సోదరిని వేధిస్తున్న వారికి ఎదురెళ్లాడు. ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఆ అల్లరిమూకలు మాటు వేయడంతో వారి చేతిలో బలైయ్యాడు. సైకోలా మారిన ఓ యువకుడి బారిన పడకుండా తన అక్కను రక్షించేందుకు ఎంతగానో పోరాడాడు ఆ బాలుడు ఎదురెళ్లి వారిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. కానీ ఆ అల్లరిమూకలు మాటువేసి చుట్టు ముట్టేయడంతో అమర్‌నాథ్‌ అసువులు బాశాడు.ఆ బాలుడు చూపిన తెగువకు ప్రపంచమే సలాం అంటోంది.కుటుంబానికి అన్నీ తానై అండగా ఉంటున్నాడన్న సంతోషం ఆ అమ్మకు, కుటుంబసభ్యులకు లేకుండా చేసిన దుర్మార్గులను ఏం చేయాలని ప్రశ్నిస్తుంది సమాజం.

మరోవైపు ఆ చిన్నారి అక్కను, అమ్మను ఇక ఆదుకొనే వారు ఎవరు? ఆ కుటుంబాన్ని రోడ్డు మీదకు లాగిన వారికి ఏ శిక్ష వేస్తే వారికి మాత్రం ఏం లాభం తీరని అన్యాయం జరగిపోయింది.అమర్‌నాథ్‌ ధైర్యసాహసాలను చూసి ఎంతో నేర్చుకోవాల్సింది చాలా ఉంది.సభ్యసమాజం సిగ్గుపడాలి వ్యవస్థలన్నీ సిగ్గుపడాలి నిన్ను కాపాడుకోలేని ఈ సమాజంలో మేం ఉన్నందుకు తలదించు కుంటున్నామని ఈ సభ్య సమాజం మళ్లీ పుట్టొద్దురా చిన్నా చేతగాని సమాజంలో బతుకుతున్న మమ్మల్ని క్షమించు ఛీకొట్టు అంటున్నారు.

అమర్నాథ్ మృతి ఘటన పై చలించిన టీడీపీ అధినేత జగన్‌ సర్కార్‌ పై ఫైర్‌ అయ్యారు. చిన్నారి అమర్నాధ్‌ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పేందుకు బాపట్ల జిల్లా ఉప్పలవారిపాలెంకి వెళ్లనున్నారు.రాష్ట్రంలో పెరిగిపోతున్న అరాచకాలపై మండిపడ్డ చంద్రబాబు ఓ చిన్న పిల్లాడిని పెట్రోల్ పోసి తగులబెట్టినా ఎందుకు ప్రభుత్వం యాక్షన్‌ తీసుకోవడం లేదని మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story