AP : గజగజ.. మళ్లీ పెరిగిన చలి
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మళ్లీ పడిపోతున్నాయి. గతనెల నుంచే చలి తీవ్రత విపరీతంగా మొదలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ వల్ల ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. తెలంగాణ లోనూ మోస్తరు వానలు, ఆకాశం మబ్బు పట్టడం వల్ల చలి బాగా తగ్గిపోయింది. కానీ గత 2 రోజులుగా చలి మళ్లీ పెరిగింది. రానున్న రోజుల్లో మరింత తీవ్రం కానుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నేడు ఏపీలో వర్షాలు పడతాయని APSDMA తెలిపింది. నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయంది. రేపు నెల్లూరు, అనంతపురం, వైఎస్ఆర్, చిత్తూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది.
చలికాలంలో దగ్గు, జలుబు, ఫ్లూ రాకుండా రోగనిరోధక శక్తి అవసరం. కొన్ని ఆహారాలు తీసుకుంటే ఇమ్యూనిటీ పెరిగి ఇవి దూరమవుతాయి. విటమిన్ C ఉండే ఆరెంజ్, లెమన్, నిమ్మను ఆహారంలో భాగం చేయాలి. అల్లం, వెల్లుల్లి తరచూ తీసుకోవాలి. ఈ సీజన్లో లభించే చిలగడదుంపలు తింటే బీటా కెరోటిన్ శరీరంలోకి చేరి ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే బచ్చలకూర, కాలే వంటి ఆకుకూరలు తింటే వాటిలోని విటమిన్ A,C,Kలతో రోగనిరోధక శక్తి బూస్ట్ అవుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com