చంద్రబాబుకు హైకోర్టులో ఊరట.. !

చంద్రబాబుకు హైకోర్టులో ఊరట.. !
అమరావతి అసైన్డ్‌ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై సీఐడీ నమోదు చేసిన కేసులో ఊరట లభించింది.

అమరావతి అసైన్డ్‌ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై సీఐడీ నమోదు చేసిన కేసులో ఊరట లభించింది. సీఐడీ విచారణపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ వరకు చంద్రబాబు, నారాయణను విచారించొద్దని హైకోర్టు చెప్పింది. సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను సవాల్‌ చేస్తూ చంద్రబాబు, నారాయణ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ్‌ లూథ్రా, నారాయణ తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున అడిషనల్‌ ఏజీ జాస్తి నాగభూషణం వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు.. చంద్రబాబు, నారాయణ కేసులో సీఐడీ విచారణపై స్టే విధించింది

Tags

Read MoreRead Less
Next Story