South rains: ముఖం చాటేసిన వరుణుడు
ఒక పక్క ఉత్తర భారతం అంతటా వరదలతో అతలాకుతలం అవుతుంటే మరోపక్క దక్షిణాట చినుకు జాడ కూడా కనపడటం లేదు.ఎగువన కర్ణాటక, దిగువన తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు ముఖం చాటేశాడు. దీంతో రాయలసీమ జిల్లాల్లో అత్యంత దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ఎప్పుడులేని విధంగా అత్యంత లోటు వర్షపాతం నమోదు అవుతోంది.ఇది ఇలాగే కొనసాగితే తాగడానికి నీరు కూడా దొరకని పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.వర్షాల కోసం ఎదురుచూసి రైతుల కన్నులు కాయలు అవుతున్న వరణుడు మాత్రం కనికరించడం లేదు.జూన్ లో సాధారణ వర్షపాత 77 మిల్లీ మీటర్లకు గానూ ఈసారి దానిలో సగ వర్ష పాతం కూడా నమోదుకాకపోవడంపై వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జులై 15 నుంచి ఆగస్టు 15 మధ్యలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. అదీ జరగకపోతే ఇక సాగు, తాగునీటి గండం తప్పేలా లేదని వాతవరణ శాఖ శాస్ర్తవేత మహదేవయ్య ఆందోళన వ్యక్తం చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com