AP Governor : గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఎంతో నష్టపోయింది: గవర్నర్

ఎన్నికల్లో ప్రజలు తమ ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారని గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ అన్నారు. ‘ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఎంతో నష్టపోయింది. సూపర్ 6 పథకాలతో మేలు చేస్తున్నాం. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం. మెగా డీఎస్సీ దస్త్రంపై సంతకం చేశాం. అన్న క్యాంటీన్ల ద్వారా పేదల ఆకలి తీరుస్తున్నాం’ అని గవర్నర్ చెప్పారు.
2047నాటికి స్వర్ణాంధ్ర కల సాకారం దిశగా అడుగులు వేస్తున్నట్లు గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ చెప్పారు. ‘పెన్షన్లు రూ.4వేలకు పెంచాం. ఏడాదికి రూ.3సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నాం. పోలవరంను పట్టాలెక్కించాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది. ఐటీ నుంచి ఏఐ రివల్యూషన్ దిశగా అడుగులు వేస్తున్నాం. మా ప్రభుత్వం వచ్చాక తలసరి ఆదాయం పెరిగింది. రూ.6.5లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం’ అని తెలిపారు.
మరోవైపు నేటి నుంచి అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సభ ఆవరణలో నినాదాలు చేయడం, ప్లకార్డుల ప్రదర్శన, కరపత్రాల పంపిణీకి అనుమతి లేదని స్పీకర్ స్పష్టం చేశారు. పరిసరాల్లో సమావేశాలు, ధర్నాలను పూర్తిగా నిషేధించారు. అసెంబ్లీ ప్రాంగణంలోకి ఇతరులకు ప్రవేశం లేదు, సభ్యుల పీఏలకు ప్రాంగణంలోకి వచ్చేందుకు పాస్‌లు రద్దు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com