Chandrababu: ఏపీని కాపాడే బాధ్యత తెలుగుదేశం-జనసేనదేనన్న చంద్రబాబు

వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ..!

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం ప్రజలంతా ఏకం కావాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కోరారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో రా కదలిరా ముగింపు బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు.వైకాపా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీని రక్షించుకునేందుకే తెలుగుదేశం-జనసేన కలిశాయని స్పష్టం చేశారు. అనంతపురం అభివృద్ధికి కియా పరిశ్రమ తెచ్చి, వేల మందికి ఉపాధి కల్పించామని, వైకాపా మాత్రం ఎన్నో పరిశ్రమలను పారద్రోలిందని చంద్రబాబు ఆక్షేపించారు.

సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ఆదుకుంటామని.. చంద్రబాబు హామీ ఇచ్చారు. ఏపీని దేశంలోనే నెంబర్‌వన్‌గా చేయాలనేదే..తన సంకల్పమని స్పష్టం చేశారు. స్కీమ్‌ల్లో కూడా స్కామ్‌లు చేసే వ్యక్తి జగన్‌ అని విమర్శించా రు. అధికారంలోకి..... వచ్చిన తర్వాత వాలంటీర్లను తొలగించబోమని వారికి న్యాయం చేస్తామని పేర్కొన్నారు.

కేసులో అనేక పిల్లిమొగ్గలు వేసింది ఎవరని చంద్రబాబు ప్రశ్నించారు. వివేకా హత్యపై చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. ఏపీని కాపాడే బాధ్యత తెలుగుదేశం-జనసేన తీసుకున్నాయన్న చంద్రబాబు...40 రోజులు ప్రజలు తమ బిడ్డల కోసం పనిచేయాలని కోరారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ 50 ఇళ్లకు ఒకరి చొప్పున నియమించిన గ్రామ, వార్డు వాలంటీర్లు అధికార పార్టీ కోసమే పనిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు విపక్షాలు వాలంటీర్లను టార్గెట్ చేస్తూ పలు ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో అధికారం మారితే కచ్చితంగా వాలంటీర్లను తొలగిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో ఇప్పటికే నెలకు 5 వేల గౌరవ వేతనంతో పనిచేస్తున్న వాలంటీర్లలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో గతంలో వాలంటీర్లపై పలు విమర్శలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు రూటు మార్చారు. ఎన్నికల వేళ వాలంటీర్లలో ఉన్న ఆందోళన గమనించి వారికి కీలక హామీ ఇచ్చారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగించి తీరుతామని పెనుకొండలో జరిగిన పార్టీ సభలో హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగించబోమని తేల్చిచెప్పశారు

Tags

Read MoreRead Less
Next Story