AP Weather: వచ్చే 6 గంటల్లో ఆ జిల్లాలకు వర్ష సూచన..

AP Weather: వచ్చే 6 గంటల్లో ఆ జిల్లాలకు వర్ష సూచన..
AP Weather: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం బలహీన పడింది.

AP Weather: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం బలహీన పడింది. వాయుగుండంగా తగ్గుముఖం పట్టి నైరుతి దిశగా గంటకు ఏడు కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. ట్రింకోమలికి ఉత్తర ఈశాన్య దిశగా 310 కిలోమీటర్ల దూరంలో ఉంది. నాగపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 260 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.

ఇది వచ్చే 6 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరంలో రేపటి వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉండనుంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story