Nara Lokesh : చంద్రబాబు, లోకేష్ కష్టానికి ఫలితం ఇది..

Nara Lokesh : చంద్రబాబు, లోకేష్ కష్టానికి ఫలితం ఇది..
X

వైజాగ్ రూపురేఖలు మారిపోబోతున్నాయి. దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన ముంబై, పూణే, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్, ఢిల్లీ లాంటి నగరాలను కాదని ఏపీకి పెట్టుబడులు తీసుకురావడంలో సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ కృషి ఎనలేనిది. అసలు ఏపీలో ఏముంది అని గత ఐదేళ్లు ఎంతోమంది నవ్వుకున్నారు. వైసిపి హయాంలో ఒక్క పెట్టుబడి రాలేదు. వచ్చిన కంపెనీలను తరిమికొట్టారు వెంటాడారు వేధించారు. ఏపీ వద్దు బాబోయ్ అని వెళ్ళిపోయిన కంపెనీలను ఒప్పించి తీసుకురావడంలోనే కదా నాయకత్వ లక్షణం అనేది బయటపడేది. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషి ఇదే. అమెరికా వెలుపల గూగుల్ డేటా సెంటర్ అతిపెద్ద పెట్టుబడి పెట్టింది ఇప్పుడు విశాఖలోనే. ఏకంగా 15 బిలియన్ డాలర్లతో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తోంది.

ఇది మామూలు విషయం కాదు.. ఇది ఏపీకి ఒక టర్నింగ్ పాయింట్. దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రశంసించారు అంటే ఏ స్థాయి ఘనత అనేది అర్థమవుతుంది. గూగుల్ తన డేటా సెంటర్ ని ఏర్పాటు చేయడానికి భారత దేశంలో ఎన్ని నగరాలు లేవు. ఆల్రెడీ అభివృద్ధి చెందిన ఐదు ప్రధాన నగరాలు ఉండి కూడా.. అవన్నీ పోటీపడినా సరే ఏపీకి ఇంత పెద్ద పెట్టుబడులు తీసుకురావడంలో నారా లోకేష్, చంద్రబాబు నాయుడు కృషి ఉన్నాయి. ఆ మధ్య మంత్రి నారా లోకేష్ స్వయంగా గూగుల్ ప్రధాన ఆఫీస్ కు వెళ్లి వాళ్లను ఒప్పించి.. ఏపీలో పెట్టుబడులు పెట్టేలా తన ప్రతిపాదనలు వినిపించారు. ఆ టైంలో గూగుల్ కొన్ని అభ్యంతరాలను లేవనెత్తింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డేటా సెంటర్ పాలసీలో ఉన్న టాక్స్ లకు సంబంధించి సవరణలు చేస్తేనే తాము పెట్టుబడులు పెడతామని తెలిపింది. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగారు. పదేపదే ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, హోం మంత్రి అమిత్ షా లాంటి వాళ్లను కలిసి ఈ సవరణలు చేయాలంటూ ఒప్పించారు. ఆ పాలసీలో సవరణలు చేస్తే గూగుల్ డేటా సెంటర్ తో పాటు ప్రపంచంలోనే దిగజా కంపెనీలు అన్నీ ఇండియాకు వచ్చి పెట్టుబడులు పెడతాయంటూ వాళ్లను ఒప్పించి సవరణలు చేయించారు.

దీంతో గూగుల్ తన డేటా సెంటర్ ను విశాఖలో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ సమక్షంలో గూగుల్ డేటా సెంటర్ కు సంబంధించిన ఒప్పందాలు జరిగిపోయాయి. దీని వెనకాల చంద్రబాబు నాయుడు, లోకేష్ కృషిని పార్టీలకు అతీతంగా కచ్చితంగా ప్రశంసించాల్సిందే. గూగుల్ అభ్యంతరాలను తెలిపితే తమకెందుకులే అని వదిలేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరీ సవరణలు చేయడం అంటే ఇదే కదా అసలైన నాయకత్వ లక్షణం. ఏపీ ని అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంది కాబట్టే ఇంత మందిని ఒప్పిస్తూ ప్రపంచంలోనే నేటి కంపెనీలను విశాఖకు తీసుకొస్తూ ఒక ఐటీ హబ్ గా మార్చేస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చిన చంద్రబాబు నాయుడుకు.. ఇప్పుడు విశాఖను అలా మార్చడంలో మంత్రి లోకేష్ కూడా తోడయ్యారు. అందుకే ప్రపంచ మేటి కంపెనీలు అన్నీ కూడా ఇప్పుడు విశాఖ వైపు చూస్తున్నాయి. రాబోయే 10 15 ఏళ్లలో విశాఖ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. ఏపీలో ఏముంది అన్న వాళ్లే నోరెళ్లపెట్టే రోజులు త్వరలోనే వస్తున్నాయి. ఏపీ యువత బయటి రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాల కోసం ఇబ్బందులు పడకుండా.. ఏపీలోనే దర్జాగా ఉద్యోగాలు చేసుకునేలా పెట్టుబడును తీసుకొస్తున్నారు. అందుకే ఏపీ యువత ఇప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ లను ప్రశంసిస్తున్నారు.

Tags

Next Story