Andhra Pradesh : కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి బెదిరింపు లేఖ

Andhra Pradesh : కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి బెదిరింపు లేఖ
X

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి బెదిరింపు లేఖ వచ్చింది. ఈ నెల 17న (ఆగస్టు 2025) ఒక వ్యక్తి ఈ బెదిరింపు లేఖను ఎమ్మెల్యే భద్రతా సిబ్బందికి అందజేశాడు. ఈ లేఖను నెల్లూరులోని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద ఇవ్వబడింది. ఆ గుర్తుతెలియని వ్యక్తి ముఖానికి మాస్క్ ధరించి వచ్చి లేఖ ఇచ్చి వెళ్ళిపోయాడు. అందులో, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తనకు రెండు కోట్లు ఇవ్వాలని, లేకపోతే చంపేస్తానని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలం వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారంలో అల్లూరు మండలం ఇస్కపాళెంకు చెందిన ఓ వ్యక్తిని అనుమానితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటు వేమిరెడ్డి ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మరో యువకుడిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానం చెప్పడం, అతని దగ్గర నాలుగు చరవాణులు ఉండటంతో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీనిపై జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌ను వివరణ కోరగా.. బెదిరింపు లేఖ వచ్చిన మాట వాస్తవమేనని, దీనిపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.

Tags

Next Story