Vizianagaram: విజయనగరం జిల్లాలో విషాదం.. ముగ్గురు విద్యార్థులకు పాముకాటు.. ఒకరు మృతి..

X
Vizianagaram: విజయనగరం జిల్లా కురుపాం మండల కేంద్రంలోని జ్యోతిరావుపూలే బాలుర పాఠశాలలో దారుణం జరిగింది. అర్ధరాత్రి ముగ్గురు విద్యార్థులను పాము కాటు వేసింది. నిద్రిస్తున్న టైంలో ముఖంపై కాటు వేయడంతో విద్యార్థులు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో వెంటనే వీరిని పార్వతీపురం తరలించి చికిత్స అందించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం విశాఖ KGH కు తరలించగా చికిత్స పొందుతూ ఓ విద్యార్థి చనిపోయాడు. ఓ విద్యార్థి వెంటిలేటర్ పై ఉన్నాడని చెప్పిన డాక్టర్లు..మరో విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
