కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. విస్సన్నపేట నుంచి ఏ- కొండూర్ వెళ్లే రహదారిలో ప్రయాణికులతో వెళుతున్న ఆటో బ్రిడ్జీని ఢీకొట్టి కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. ఎన్ఎస్పీ కెనాల్‌పై నిర్మించిన బ్రిడ్జి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులంతా చిరు వ్యాపారం చేసుకునే సంచార జాతుల వారిగా తెలుస్తోంది. చనిపోయినవారు ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

Tags

Read MoreRead Less
Next Story