YSRCP : బయటపడ్డ వైసీపీ గుట్టు.. నేషనల్ మీడియాలో రచ్చ..

YSRCP : బయటపడ్డ వైసీపీ గుట్టు.. నేషనల్ మీడియాలో రచ్చ..
X

తిరుమల కల్తీ నెయ్యి కేసుపై దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. వైసీపీ నేతలు తిరుమలలో ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారో.. ఎంతటి దారుణాలు చేశారనేది అందరికీ తెలిసిందే. సుప్రీంకోర్టు నియమించిన సిట్ అధికారులే స్వయంగా కల్తీ జరిగిందని చెప్పినా సరే వైసీపీ నేతలు మాత్రం వితండ వాదనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇన్ని రోజులు అసలు కల్తీనే జరగలేదని వైసీపీ నేతలు వాదిస్తున్న సంగతి తెలిసిందే కదా. కానీ సిట్ రిపోర్టులో మాత్రం స్పష్టంగా కల్తీ చేశారని.. అత్యంత దారుణమైన కెమికల్ తో నెయ్యిని తయారు చేశారని పేర్కొన్న విషయం తెలిసిందే. ఇదే అంశం మీద నేషనల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

ఇది హిందూ భక్తుల నమ్మకంపై దాడి అంటూ పెద్ద ఎత్తున డిబేట్లు పెడుతున్నారు నేషనల్ మీడియాల ప్రతినిధులు. ఆర్నబ్ గోస్వామితో పాటు సీఎన్ ఎన్ సహా ఇతర నేషనల్ మీడియా సంస్థలు ఇదే రకమన డిబేట్లు పెడుతున్నాయి. వైసీపీ తీరును అందరూ ఏకిపారేస్తున్నారు. డబ్బులు సంపాదించుకోడానికి ఏకంగా దేవుడి గుడిలోనే ఇలాంటి నీతిమాలిన స్కాములు చేస్తారా.. కోట్లాది మంది హిందువులతో కెమికల్ కలిపిన లడ్డూలను తినిపిస్తారా అంటూ మండిపడుతున్నారు.

ఇంత చేసినా సరే వైసీపీ నేతల్లో ఎలాంటి పశ్చాత్తాపాలు కనిపించట్లేదని.. ఇంతటి దారుణాలు ఎందుకు చేశారంటూ అనేక హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న హిందువులు అందరూ ఈ దారుణాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారు ఇదే అంశం మీద నేషనల్ మీడియా ఛానెళ్లతో మాట్లాడుతూ.. జరిగిన దారుణాలను వివరిస్తున్నారు. ఇలాంటి అక్రమాలు ఎవరు చేసినా సరే విడిచిపెట్టేది లేదని.. నిందితులకు కఠిన శిక్ష పడేలా టీటీడీ బోర్డు చర్యలు తీసుకుంటుందని వివరిస్తున్నారు.

Tags

Next Story