YV Subba Reddy : వైవీ సుబ్బారెడ్డి అండ లేకుండా.. చిన్నప్పన్నకు సాధ్యమా..?

తిరుమల కల్తీ నెయ్యి కేసులో అడ్డంగా దొరికినా సరే వైవీ సుబ్బారెడ్డి మాత్రం వితండ వాదనలు చేస్తున్నారు. అసలు తన తప్పేం లేదన్నట్టే మాట్లాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే అసలు సిట్ రిపోర్టులో కల్తీ జరిగినట్టే రాలేదంటున్నారు. జంతువుల కొవ్వు కలవలేదంటున్నారు. చిన్నప్పన్న 2018లోనే తన వద్ద మానేశాడని.. అప్పటి నుంచి ఎక్కడ పనిచేస్తున్నాడో.. ఏం చేస్తున్నాడో తనకు తెలియదని బుకాయిస్తున్నారు. అసలు చిన్నప్పన్నకు ఎలాంటి పదవి లేకపోయినా అంత పెద్ద స్కామ్ ఎలా చేయగలుగుతాడు. చిన్నప్పన్న ఢిల్లీలో ప్రీమియర్ డెయిరీ చైర్మన్ గుప్తాతో చర్చలు జరిపి కిలోకు 7 రూపాయలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు.
అదే ఢిల్లీలో కొవిల్ జైన్ తోనూ భేటీ అయి కిలోకు 25 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే.. జైన్ చిన్నప్పన్న మీద ఫిర్యాదు చేసినా వైవీ సుబ్బారెడ్డి సైలెంట్ గా ఉన్నారు. చిన్నప్పన్నకు కల్తీ నెయ్యికి సంబంధించిన డబ్బులు కూడా ఢిల్లీలోనే ముట్టాయి. అంతకు ముందు బోలేబాబా డెయిరీ ఒప్పందం కూడా ఢిల్లీలోనే జరిగింది. చిన్నప్పన్న ఒప్పందాలు చేసుకున్న ఎంపీ క్వార్టర్స్ వైవీ సుబ్బారెడ్డిదే అనే ప్రచారం ఉంది. ఆ డెయిరీలకు తిరుమలలో కాంట్రాక్టులు ఇప్పించడం అంటే వైవీ సుబ్బారెడ్డి అండ లేకుండా ఎలా సాధ్యం అవుతుంది. వైవీ సుబ్బారెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండానే కాంట్రాక్టులు వెళ్లిపోయాయంటే ఎలా నమ్మాలి.
టీటీడీలో ఎవరికి ఏ కాంట్రాక్టులు వెళ్తున్నాయో కూడా వైవీ సుబ్బారెడ్డికి తెలియదంటే నమ్మాలా. చిన్నప్పన్న వాడిన ఫోన్ నెంబర్ వైవీ సుబ్బారెడ్డిదే. వైవీ సుబ్బారెడ్డి పర్మిషన్ లేకుండా ఆయన టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు కాంట్రాక్టులు వెళ్లడం అసాధ్యం. అయినా సరే వైవీ ఈ విషయంలో మాట దాటేసేందుకు చాలా ప్రయత్నిస్తున్నారు. కానీ ఎంత చేసినా ఆయన దొరికిపోయారనే విషయం అందరికీ తెలుసు అంటున్నారు కూటమి నేతలు.
Tags
- Tirumala Ghee Scam
- YV Subba Reddy
- TTD Adulteration Case
- SIT Report Tirumala
- Chinna Appanna
- Bollebaba Dairy
- Delhi Ghee Deal
- Animal Fat Allegations
- TTD Corruption
- Tirupati Laddu Controversy
- YSRCP Leaders Scam
- Andhra Pradesh Politics
- Coalition Leaders Attack
- Ghee Adulteration Exposed
- Andhra Pradesh News
- Latest Telugu News
- TV5 News
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
