Tirumala Ghat Roads: ఘాట్ రోడ్లపై దృష్టిపెట్టిన టీటీడీ.. రంగంలోకి ప్రత్యేక బృందం..

Tirumala Ghat Roads: తిరుమల ఘాట్ రోడ్లలో కొండచరియలు విరిగిపడే ప్రమాదాలకు శాశ్వతంగా నిర్మూలించడంతో పాటు సురక్షిత మార్గాలుగా ఘాట్ రోడ్లను తీర్చిదిద్దేందుకు నిపుణుల బృందం రంగంలోకి దిగింది. క్షేత్ర స్థాయిలో పరిశీలనను నిపుణులు చేపట్టారు. అమృత యూనివర్సిటీకి చెందిన ప్రోఫెసర్లు, శాస్త్రవేత్తలు ఘాట్ రోడ్లలోని కొండ ప్రాంతాలను నిశితంగా పరిశీలించారు. రెండు వేరువేరు బృందాలుగా విడిపోయి ఈ పరిశీలనలు చేపట్టారు. ఒక బృందం కొండ శిఖరాలు పరిశీలనను చేయగా, ఆకాశంలోనుంచి డ్రోన్ల ద్వారా నిశిత పరిశీలనను మరో బృందం చేస్తోంది.
ఈ ప్రక్రియ ద్వారా పైనుంచి కురిసే వర్షం నేరుగా పడే కొండశిఖరాల జాలువారే తత్వాన్ని , పరిస్థితులను సరిగ్గా అంచనా వేసేందుకు డ్రోన్ల ద్వరా నిశిత పరిశీలన ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని ప్రమాదకరమైన సెగ్మెంట్లు, జారుడుభూమిని గుర్తించామని, ఈ విషయంపై టీటీడీ వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. త్వరలో సమగ్ర నివేదికను టీటీడీకి అందజేస్తామన్నారు అమృత యూనివర్సిటీ ప్రోఫెసర్ ఎస్.కె.వదావన్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com