YV Subba Reddy : వైవీ సుబ్బారెడ్డి హయాంలో చిన్నపన్న హవా..!

ఏపీలో తిరుమల లడ్డు నెయ్యి కల్తీపై ఎంత రచ్చ జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. సిట్ సాక్షాలతో సహా లడ్డూలో కల్తీ జరిగింది అని నివేదికలో చెప్పింది. అన్ని సాక్షాలతో సహా వైవి సుబ్బారెడ్డి హయాంలోనే నెయ్యి కల్తీ జరిగినట్టు బయటపెట్టినా సరే.. వైసిపి మాత్రం వితండ వాదనలు చేస్తూనే ఉంది. వైవీ సుబ్బారెడ్డి తనకు చిన్నప్పన్నతో ఎలాంటి సంబంధాలు లేవని ఎన్నో కహానీలు చెబుతున్నారో చూస్తున్నాం కదా. అయితే వైవీ సుబ్బారెడ్డి ఎన్ని అబద్ధాలు చెప్పినా సరే ఆయన హయాంలోనే చిన్నప్పటిన్న ఇలాంటి దురాగతాలు ఎన్నో చేశాడు అని ఎప్పటికప్పుడు అనేక సాక్షాలు బయటకు వస్తూనే ఉన్నాయి. తాజాగా 2021లో జరిగిన ఒక పరిణామం గురించి బయటకు వచ్చింది. 2021 సెప్టెంబర్ లోనే వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. అదే నెలలో చిన్నప్పన్న పేరు మీద 6433 సుపథం టికెట్లు జారీ అయ్యాయి. వైవి సుబ్బారెడ్డి దగ్గర చిన్నప్పన్న పనిచేయకపోతే.. ఆయన ఆదేశాలు ఎలా టీటీడీలో అమలు అయ్యాయి అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. చిన్నప్పన్నకు వైవి సుబ్బారెడ్డికి ఎలాంటి సంబంధాలు లేకపోతే టీటీడీ నుంచి అన్ని వేల టికెట్లు ఒకే నెలలో ఎలా జారీ అవుతాయి.
నాలుగేళ్ల సమయంలో కొన్ని లక్షల టికెట్లు చిన్నప్పన్న సిఫార్సులతో జారీ అయ్యాయి. వైవి సుబ్బారెడ్డి ఆఫీసు నుంచి చిన్నప్పన్న చిన్న బాసుగా చక్రం తిప్పాడు. మరి వైవి సుబ్బారెడ్డి చెబుతున్నట్టు 2018 లోనే చిన్నప్పన్న తన దగ్గర మానేస్తే.. అన్ని లక్షల టికెట్లు ఎలా జారీ అవుతాయి. ఇప్పటికీ టీటీడీ రికార్డుల్లో ఇవన్నీ ఉన్నాయి. అయినా సరే వాటి గురించి వైవి సుబ్బారెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ఎంతసేపు వైవి సుబ్బారెడ్డి 2018 లోనే తన దగ్గర చిన్నప్పన్న మానేశాడు అంటూ ఒక కట్టు కథనం అల్లేసి దాన్నే రిపీట్ చేస్తూ వస్తున్నారు. అంతేగాని చిన్నప్పన్న సిఫార్సుల గురించి ఎందుకు మాట్లాడట్లేదు.
పైగా వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు అధికారిక లెటర్ హెడ్ లో చిన్నప్పన్న నెంబర్ ఉంది. మరి చిన్నప్పన్నతో ఎలాంటి సంబంధం లేకపోతే నెంబర్ ఎందుకు అధికారిక లెటర్ లో పెట్టారు. చిన్నప్పన్న వైవి సుబ్బారెడ్డి అండతోనే డెయిరీలను బ్లాక్ మెయిల్ చేసి పెద్ద ఎత్తున ముడుపులు లాగేసినట్టు నివేదికలో తేలిపోయింది. బోలే బాబా డెయిరీ, ఇతర డెయిరీలో నుంచి కోట్లాది రూపాయలు ఢిల్లీలోని వైవీ సుబ్బారెడ్డి ఆఫీసు నుంచే తీసుకున్నాడు అనేది ఓపెన్ సీక్రెట్. కానీ వైది సుబ్బారెడ్డి వాటి గురించి మాట్లాడటం లేదు. ఆయన ఎంత బుకాయించినా సరే సాక్షాలను ఎవరు తారుమారు చేయలేరు అనేది గుర్తుంచుకోవాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
