Tirumala Parakamani Heist : సీఐడీ సంచలన నివేదిక.. పరకామణి నిందితుల్లో భయం..

తిరుమల దేవస్థానంలో జరిగిన పరాకామణి చోరీ కేసు ఏపీ రాజకీయాల్లో ఎంత హాట్ టాపిక్ అనేది మనకు తెలిసిందే. వైసిపి చేసిన అరాచకాలలో ఇది కూడా ఒకటి. శ్రీవారి ఆలయంలో ఇష్టం వచ్చినట్టు సాగించిన అరాచక కాండకు ఇది అతి పెద్ద నిదర్శనం. ఇన్ని రోజులు తమకేం సంబంధం లేదు అని గొప్పలు చెప్పుకున్న వైసిపి నేతల బాగోతాలు మొత్తం బయటపడబోతున్నాయి. హైకోర్టు ఏర్పాటు చేసిన సిఐడి ఈ కేసులో పూర్తిస్థాయి నివేదికను రెడీ చేసింది. దాన్ని హైకోర్టులో సమర్పించడానికి సిద్ధమైంది. దీంతో పరకామణి కేసులో నిందితులుగా ఉన్న వారితో పాటు ఇప్పటివరకు తప్పించుకున్న వాళ్ళందరి పేర్లు కూడా ఈ నివేదికలో ఉన్నట్లు సమాచారం. ఇంకేముంది వాళ్ళందరిలో భయం మొదలైంది. ఎన్ని అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలని చూసినా సాక్షాలు బలంగా ఉండటంతో వాళ్ల నిజస్వరూపాలు అన్నీ బయటపడబోతుండటం వల్ల వైసీపీలో వణుకు మొదలైంది. సిఐడి ఈ కేసులో అన్ని రకాలుగా విచారణ జరిపింది.
రవికుమార్ తో ఏవీ ఎస్ ఓ సతీష్ కుమార్ ఎందుకు లోకదాలత్ లో రాజీ కుదుర్చుకున్నారు. రవికుమార్ ఇచ్చిన ఆస్తులపై టీటీడీ బోర్డు విచారణ చేయకుండానే వాటిపై ప్రజల నుంచి అభ్యంతరాలను తెలుసుకోకుండానే నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఎందుకు ఓకే చేశారు. వైసిపి హయాంలో టీటీడీ చైర్మన్లుగా ఉన్న వైవీ సుబ్బారెడ్డితో పాటు భూమన కరుణాకర్ రెడ్డిని కూడా సిఐడి విచారణ జరిపింది. రవికుమార్ వద్ద అన్ని కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇలా చోరీ ఎన్ని రోజులుగా చేశాడు, రవికుమార్ వెనకాల ఉన్న పెద్దలు ఎవరు ఎవరి ఒత్తిడితో కేసును బోర్డుకు చెప్పకుండా రాజీ చేసుకున్నారు అనే కోణంలో కూడా సిఐడి అధికారులు పూర్తిగా విచారణ జరిపారు.
ఇంకో పక్క సతీష్ కుమార్ అనుమానాస్పద మృతిపై కూడా విచారణ జరిపింది సిఐడి. అతని మృతికి సంబంధించి కీలక ఆధారాలను కూడా సేకరించింది. అతని వీపుపై, స్కల్ పై పెద్ద గాయాలు ఉన్నట్లు కూడా సిఐడి అధికారులు ఇప్పటికే చెప్పారు. ఆయనను కచ్చితంగా మర్డర్ చేసి ఉంటారనే అనుమానాస్పద కోణంలో విచారణ సాగించారు. 156 పేజీల నివేదికను రెడీ చేసి హైకోర్టుకు సమర్పించబోతున్నారు. దీంతో పరకామణి కేసులో అంతిమ లబ్ధిదారుల పేర్లు బయటపడబోతున్నాయి. వైసిపి నేతలు చేసిన అరాచకాలు ప్రజలకు తెలవనున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

