తిరుమల తిరుపతి దేవస్థానం మరో సంచలన నిర్ణయం..!

తిరుమల తిరుపతి దేవస్థానం మరో సంచలన నిర్ణయం..!
తిరుమల తిరుపతి దేవస్థానం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. స్వామివారి కైంకర్యాలను చూసే అర్చకులను కాదని, వంశపారంపర్యంగా వస్తున్న వారికి ముఖ్య అర్చకుల హోదా ఇచ్చింది.

తిరుమల తిరుపతి దేవస్థానం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. స్వామివారి కైంకర్యాలను చూసే అర్చకులను కాదని, వంశపారంపర్యంగా వస్తున్న వారికి ముఖ్య అర్చకుల హోదా ఇచ్చింది. వంశపారంపర్యంగా వస్తున్న నాలుగు కుటుంబాల వారికి అవకాశం ఇస్తూ తాజా ఉత్తర్వుల ఇచ్చింది. ఇందులో గొల్లపల్లి కుటుంబం నుంచి గోపీనాథ్ దీక్షితులు, తిరుపతమ్మ కుటుంబం నుంచి నారాయణ దీక్షితులు, పైడపల్లి కుటుంబం నుంచి రాజేశ్ దీక్షితులు, పెద్దింటి కుటుంబం నుంచి రవిచంద్ర దీక్షితులను ముఖ్య అర్చకులుగా నియమిస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది.

టీటీడీ ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితులను నియమించిన ప్రభుత్వం.. మరో ముగ్గురు అర్చకులను కూడా విధుల్లోకి తీసుకుంది. శ్రీవారి ఆలయంలో కొత్తగా మరో నలుగురిని ప్రధాన అర్చకులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వులతో స్వామివారి ఆలయంలో ఎనిమిది మంది ప్రధాన అర్చకులు ఉన్నారు. అయితే, కొత్తగా నియామకం అయిన వాళ్లు స్వామివారి కైంకర్యాలు చేస్తారా.. లేక ఇప్పుడు కొనసాగుతున్న నలుగురు ప్రధాన అర్చకులే యథావిధిగా విధులు కొనసాగిస్తారా అన్నది తేలాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story