TTD : తిరుపతి లడ్డులో వెజిటబుల్, జంతు కొవ్వులు కలిశాయి NDDB చెప్పింది.

తిరుపతి లడ్డులో వెజిటబుల్, జంతు కొవ్వులు కలిశాయి NDDB చెప్పింది
టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ కుటుంబ సమేతంగా పవన్ కళ్యాణ్ పడ్డ బందరు బియ్యం దొంగ నీతులు చలోక్తులు చెప్పటం హాస్యాస్పదం బందరు ఊసరవెల్లి చెప్పగానే నేను రాత్రికి రాత్రి వైష్ణవి డెయిరీ గేట్లకు రంగులు వేసాననడం హాస్యమే. వెబ్‌సైట్లు డౌన్ చేయటం, మార్పింగ్ చేయటం వైసిపి పేటెంట్ హక్కులు, ఫేక్ బ్రతుకులు మీవి మావి కావు. రాజధాని అంశంలో ఆరోపణలు చేసినపుడే ఏమీ పీకలేరని చెప్పా, ఈరోజు అదే చెప్తున్నా. 33 రోజులు నన్ను జైల్లో పెట్టి సంగం డెయిరీ సర్వర్లు హ్యాక్ చేయాలని ప్రయత్నించారు అణువణువూ జల్లిడపట్టినా ఏ తప్పూ దొరకలేదు. కాంగ్రెస్, వైసిపి ప్రభుత్వ హయంలోనే భయపడలేదు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు సాక్షి పేపర్, సాక్షి ఛానల్‌కి 307 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్‌మెంట్స్ ఇచ్చారు. వైసిపి ప్రభుత్వ హయంలో భారతీ సిమెంట్స్ నుంచి కాంట్రాక్టర్లతో 3 లక్షల టన్నులకు పైగా సిమెంట్‌ను కనిపించారు. వైసిపి పెట్టిన 22 కేసులు ఇప్పటికీ నా మీదున్నాయి, ప్రభుత్వం నాకు సహకరిస్తే ఆ తప్పుడు కేసులు ఎత్తేయాలి కదా?? వైష్ణవి పక్కన సంగం డెయిరీ ఎంబ్లమ్ ఎందుకు వచ్చిందో మీతో చేతులు కలిపి నా మీద కుట్ర చేసి కేసులు పెట్టించిన మాజీ చైర్మన్‌ను అడగండి. నేను బాధ్యత చేపట్టాక వైష్ణవి డెయిరీని నిలివేసాను.ఫేక్ బతుకులకు పేటెంట్ హక్కులు వైసిపివి, ఫాల్త్ గాళ్ళు వైసీపీ వాళ్ళు.తిరుపతి లడ్డు కల్తీ అయిందనేది నిజం, వెజిటబుల్ , జంతువుల కొవ్వు ఉందని NDDB చెప్పింది. వైసిపి వాళ్ళు ఇప్పటికైనా స్వామి దగ్గరకు వెళ్ళి తప్పు ఒప్పుకోవాలి.కల్తీ నెయ్యి అక్రమ సొమ్ము విజయవాడకి 12.5 కోట్లు, చెన్నైకి 7.5 కోట్లు వచ్చాయని సిట్ చెప్పింది. బహిరంగ మార్కెట్ లో బటర్ ధర 360 రూ.లు ఉంటే 316 రూ కి నెయ్యి ఎలా సరఫరా చేశారు? పాలు, వెన్న లేకుండా నెయ్యి తయారు చేసిన మహా ఘనులు వైసీపీ నాయకులు. సంగం డెయిరీ 2020, 2021లో కూడా టీటీడీ నెయ్యి టెండర్ వేసింది. ఆ దేవ దేవుడి దగ్గర సేవ చేయడానికి ఎన్నో సంవత్సరాల నుండి సంగం డెయిరీ ఎదురు చూసింది స్వామి ఇప్పుడు అవకాశం ఇచ్చారు. చంద్రబాబు గారు చెపితే టెండర్ ఇవ్వలేదు.నిబంధనలు, సాంకేతిక శాస్త్రీయ పరీక్షలు అనంతరం టెండర్‌లో పాల్గొని సంగం డెయిరీ నెయ్యి సరఫరా చేస్తుంది. హెరిటేజ్ ఒక్క నెయ్యి పూస కూడా టీటీడీకి సరఫరా చేయలేదు. సంగం డెయిరీ గుంటూరు రైతులది, శ్రీజ డెయిరీ చిత్తూరు మహిళలది. వైసిపి చేసిన పాపాన్ని మోసి సమర్ధించే పాపం బొత్సా గారు దాన్ని ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని దగ్గర తప్పు చేస్తే మట్టిలో కలిపోవడం ఖాయం. పవిత్రమైన తిరుమల లడ్డుని అపవిత్రం చేసిన వైసిపి ఆ తప్పు నుండి బయట పడేందుకు ఇతరుల మీద బురద జల్లుతుంది. వైసిపి నాయకులకు సవాల్ విసురుతున్నా అమూల్ తరువాత దక్షిణ భారత దేశంలో నాణ్యమైన ఉత్పత్తులు అందించేది సంగం డెయిరీ.
Tags
- Tirupati laddu controversy
- NDDB report Tirumala laddu
- Dhulipalla comments
- Sangam Dairy chairman Dhulipalla
- TTD laddu adulteration issue
- YSRCP controversy Tirumala
- Tirupati laddu ghee issue
- Andhra Pradesh politics
- TTD ghee tender Sangam Dairy
- laddu quality debate Tirumala
- Andhra Pradesh News
- Latest Telugu News
- TV5 News
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
