AP : ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు.. టోల్ తీత మొదలు

దేశమంతటా రోడ్లు బాగుపడుతున్నకొద్దీ టోల్ బాదుడు మరింత పెరగనుంది. రోజులో ఎన్నిసార్లు టోల్‌గేట్ నుంచి రాకపోకలు సాగిస్తే అన్నిసార్లు టోల్ కట్టాల్సిందే అనే రూల్. ఏపీలోని 65 టోల్ ప్లాజాల్లో ఇప్పుడు ఇదే పరిస్థితి నెలకొంది. విజయవాడ-గుంటూరు మధ్య జాతీయ రహదారిపై కాజ వద్ద ఉన్న టోల్‌ప్లాజాలో వాహనదారులు ఒకరోజులో ఎన్నిసార్లు రాకపోకలు సాగిస్తే, అన్నిసార్లూ టోల్ మోత మోగుతోంది. వీటి బీవోటీ గడువు ముగియడంతో అక్టోబరు నుంచి కొత్త నిబంధన ప్రకారం టోల్ వసూళ్లు జరుగుతున్నాయి. సెప్టెంబరు వరకు ఒకసారి వెళితే కారుకు 160 రూపాయలు, తిరుగు ప్రయాణంలో 80 రూపాయలు చెల్లిస్తే సరిపోయేది. 24 గంటల వ్యవధిలో మళ్లీ ఎన్నిసార్లు తిరిగినా టోల్ వసూళ్లు ఉండేవి కావు. కానీ అక్టోబరు నుంచి అమలులోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనల ప్రకారం ఎన్నిసార్లు తిరిగితే అన్నిసార్లూ ఒకవైపు పూర్తి ఫీజు, రెండోసారి సగం ఫీజు చొప్పున.. వసూలు చేస్తున్నారు. విజయవాడ-గుంటూరు మధ్య నిత్యం వందలమంది వాహనాల్లో రాకపోకలు సాగిస్తుంటారు. వారిపై టోల్ రూపంలో తీవ్ర భారం పడుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com