Visakhapatnam : విశాఖలో సీఎం పర్యటన సందర్భంగా ట్రాఫిక్ పోలీసుల ఓవర్ యాక్షన్

Visakhapatnam : విశాఖపట్టణంలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ పోలీసుల ఓవరాక్షన్... స్థానికులను ముప్పు తిప్పలు పెట్టింది. శారదాపీఠానికి వెళ్లిన జగన్... అక్కడి నుంచి తిరిగి ఎయిర్‌పోర్టుకు వెళ్లే వరకు... ఆ దారిలో వాహనాలను ఆపేశారు. దీనివల్ల అత్యంత రద్దీగా ఉండే NAD జంక్షన్‌లో సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది.
రెండు కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ వారితో వాగ్వాదానికి దిగారు.ఫ్లైట్ మిస్ అయిపోతే ఎవరు బాధ్యత వహిస్తారంటూ వారిపై మండిపడ్డారు. మరోవైపు... సీఎం పర్యటన సందర్భంగా వేపగుంట, గోపాలపట్నం, పెందుర్తి ప్రాంతాల్లో షాపులు కూడా బంద్ చేశారు. దీంతో ఆయా ప్రాంతాలు కర్ఫ్యూ పెట్టినట్లుగా నిర్మానుష్యంగా మారాయి.
పోలీసుల వైఖరిపై స్థానికులు అశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ మరో విడ్డూరం ఏంటంటే అన్ని దుకాణాలు మూసేసిన పోలీసులు.. వైన్ షాప్ జోలికి మాత్రం వెళ్లలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com