Electric Shock : అల్లూరి జిల్లాలో విషాదం.. విద్యుత్ షాక్‌తో ఇద్దరు కూలీలు మృతి

Electric Shock : అల్లూరి జిల్లాలో విషాదం.. విద్యుత్ షాక్‌తో ఇద్దరు కూలీలు మృతి
X

అల్లూరి సీతారామరాజు జిల్లా గొందిపల్లిలో విషాదం జరిగింది. రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్న కూలీలపై విద్యుత్ తీగలు తెగిపడడంతో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రభుత్వ ఆదేశాలతో జి.మాడుగుల మండలం గొందిపల్లి లో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు తెగిన తీగలు కూలీల మీద పడడంతో కరెంట్ షాక్‌తో ఇద్దరు కూలీలు స్పాట్ లోనే చనిపోయారు. తోటికూలీలు చూస్తుండగానే ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కరెంట్ సరఫరా నిలిపివేసి కూలీల డెడ్ బాడీలను పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Tags

Next Story