Palnadu District : పల్నాడు జిల్లాలో విషాదం.. రైలు కిందపడి ఇద్దరు మృతి..

Palnadu District : పల్నాడు జిల్లాలో విషాదం.. రైలు కిందపడి ఇద్దరు మృతి..
X

పల్నాడు జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. పిడుగురాళ్ల పరిధిలోని జానపాడు వద్ద రైలు కింద పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులు గుర్తుపట్టడానికి వీలు లేకుండా చిద్రం అయ్యాయి. జానపాడు గ్రామ సమీపంలోని రైలు పట్టాలపై ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలు పూర్తిగా ఛిద్రమై ఉండటంతో వారిని గుర్తించడం కష్టంగా మారింది. అయితే, మృతి చెందిన వారిలో ఒకరు అదే ప్రాంతంలో భిక్షాటన చేసుకునే వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. కాగా ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో మరొకరి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Tags

Next Story