AP : స్నేహితుల దినోత్సవం రోజు విషాదం.. ఇద్దరు స్నేహితులు మృతి

AP : స్నేహితుల దినోత్సవం రోజు విషాదం.. ఇద్దరు స్నేహితులు మృతి
X

అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలోని టి.వీరాపురం గ్రామ సమీపంలో దొణగంగమ్మ గుడివద్ద నీటిలో పడి ఇద్దరు బాలికలు మృతి చెందారు. ఆదివారం ఉదయం ఇంటి నుంచి తోటకు వెళతామని వెళ్లిన వారు సాయంత్రానికి దొణగంగమ్మ నీటిలో శవాలై తేలారు. రాత్రి సుమారు 8 గంటల సమయంలో వారి మృతదేహాలను గుర్తించి వెలికి తీశారు. మృతి చెందిన స్వేత (11) మౌనిక (9) ఇద్దరు పక్క పక్క ఇంటిలో ఉండే ప్రాణ స్నేహితులు కావడం విశేషం. స్నేహితుల దినోత్సవానే మృత్యువు వడిలో చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి బయలుదేరారు.

Tags

Next Story