AP : మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఇంట తీవ్ర విషాదం

AP : మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఇంట తీవ్ర విషాదం
X

మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కురసాల కన్నబాబు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి కురసాల సూర్యారావు (90) ఆగస్టు 19న మధ్యాహ్నం కాకినాడలోని స్వగృహంలో కన్నుమూశారు. సూర్యారావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఆయన అంత్యక్రియలు ఆగస్టు 20న కాకినాడలో జరగనున్నాయి.సూర్యారావు మృతి పట్ల వైఎస్సార్సీపీ నాయకులు, మంత్రులు, ఇతర ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కురసాల సూర్యారావు మృతితో కురసాల కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కురసాల కన్నబాబు సుదీర్ఘ కాలం పత్రికా రంగంలో పనిచేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున పిఠాపురం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2011లో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనమైన తర్వాత ఆయన రాజకీయంగా కొంతకాలం మౌనంగా ఉన్నారు. 2014లో వైఎస్సార్సీపీలో చేరారు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రిగా పనిచేశారు.

Tags

Next Story