చదుకోవాలంటే 5కి.మీ. నడవాల్సిందే..!

చదుకోవాలంటే 5కి.మీ. నడవాల్సిందే..!
ప్రభుత్వ పాఠశాల లేకపోవడం వల్ల ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అర్ల గ్రామానికి రోజూ నడిచి వెళ్లాల్సి వస్తోంది. నిత్యం కొండల మధ్య నుంచి నడవాల్సి రావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటోన్న విద్యార్ధులు

అందరూ చదుకోలన్నది సర్కారు లక్ష్యం. కానీ అందుకు తగ్గ మౌలిక వసతులు ఏర్పాటు చేయడం లేదు. దీంతో అనేక మంది విద్యకు దూరమవుతున్నారు. ముఖ్యంగా గిరిజనులు చదవుకు దూరమవుతున్నారు.అనకాపల్లి జిల్లాలో పరిస్థితే దీనికి నిదర్శనం.రోలుగుంట మండలం, అర్ల పంచాయతీ పరిధిలో ఈ దుస్థితి ఉంది. లోసంగి, పాత లోసంగి, పిత్రి గెడ్డ, పెద గరువు గిరిజన గ్రామాలల్లో మొత్తం 80 మంది వరకు విద్యార్థులున్నారు. ఇక్కడ ప్రభుత్వ పాఠశాల లేకపోవడం వల్ల ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అర్ల గ్రామానికి రోజూ నడిచి వెళ్లాల్సి వస్తోంది. నిత్యం కొండల మధ్య నుంచి నడవాలి. వర్షం వచ్చినా, ఎండ తీవ్రంగా ఉన్న ఇక్కడ స్కూళ్లకు వెళ్లని పరిస్థితి. దీంతో ఆదివాసీ పిల్లలు ప్రభుత్వ విద్యను నోచుకోవడం లేదు. గతంలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి గుర్రంపై ఇక్కడికి వచ్చారు. ఆరు నెలలలో స్కూలు ఏర్పాటు చేసి ఉపాధ్యాయులను నియమిస్తామని ఎంతో ఆర్భాటంగా చెప్పారు. ఆరు నెలలు అయిపోయింది. ఇప్పుడు స్కూళ్లుకు కూడా తెరుచుకున్నాయి. కానీ తన హామీని నిలబెట్టుకోలేకపోయారు. దీనిపై తీవ్రంగా మండిపడుతున్నారు స్థానికులు.

కేవలం విద్య ఒక్కటే కాదు,ఇక్కడి ప్రజలకు వైద్యం కూడా అందడం లేదు. పూర్తిస్థాయిలో రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల గ్రామంలో ఎవరికి అనారోగ్యంగా ఉన్న డోలీ మోతలతో తీసుకెళ్లాల్సిందే. ఇక తాగునీటి కోసం మూడు కిలోమీటర్లు నడవాల్సిందే. గడ్డ వాగు దగ్గరకు వెళ్లి నీళ్లు తెచ్చుకుని వాడుకుంటున్నారు ఇక్కడి గిరిజన మహిళలు.దీనిపై జిల్లా కలెక్టర్ మరియు అధికారులు తక్షణమే స్పందించి, సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story