Ap: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మహాప్రస్థానం వాహనాల కొరత

Ap: ప్రభుత్వ ఆస్పత్రుల్లో  మహాప్రస్థానం వాహనాల కొరత
మృతదేహాల తరలింపునకు రాష్ట్రం లో ఇక్కట్లు

కుటుంబ సభ్యులు చనిపోతే పరివారమంతా పుట్టెడు దుఃఖంలో ఉంటుంది. అంతటి బాధలోనూ మృతదేహాల్ని అడ్డుపెట్టుకుని వ్యాపారం చేయడం శవాలపై చిల్లర ఏరుకోవడమే ! మానవత్వంలేని జగన్‌ పాలనలో ఈ జాడ్యం వేళ్లూనుకుంది. ప్రభుత్వాస్పత్రుల్లో చనిపోయిన వారి మృతదేహాల్ని ఇళ్లకు తరలించే మహాప్రస్థానం అంబులెన్సులు పెంచుతామని గొప్పలు చెప్పిన జగన్‌ వ్యవస్థను ప్రైవేటు అంబులెన్సుల మాఫియాకు వదిలేశారు. వేలకు వేలు సమర్పించుకోలేని పేదలు బైకులు, డోలీల్లో మృతదేహాల్ని మోసుకెళ్లాల్సి వస్తోంది.

అన్నమయ్య జిల్లా కొండూరుకు చెందిన బాలుడు కిడ్నీ సమస్యతో చనిపోయాడు. మృతదేహం ఉచితంగా ఇంటికి తరలించాల్సిన మహాప్రస్థానం అంబులెన్స్ రాలేదు. రివర్స్‌లో 20 వేలు ఇవ్వాలని లంచం అడిగారు. చివరకు పుట్టెడు దుఃఖాన్ని దిగిమింగుకుని కుటుంబ సభ్యులు బైక్‌పైనే మృతదేహాన్ని తీసుకెళ్లారు. అప్పట్లోఆ ఘటన జాతీయస్థాయిలో దుమారం రేపడంతో మహాప్రస్థానం అంబులెన్సులు పెంచుతామని జగన్‌ ప్రగల్భాలు పలికారు. సీఎం మాటతప్పరు, మడమ తిప్పరేమో అనుకుని రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వాస్పత్రుల నుంచి మొత్తంగా 30 వాహనాలు కావాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. నేటికీ అతీగతీలేదు.


నెల్లూరు జిల్లా సంగం గ్రామానికి చెందిన బాలుడు చనిపోతేమృతదేహాన్ని ఆస్పత్రి నుంచి ఇలా బైకుపైనే తీసుకెళ్లాల్సి వచ్చింది.విశాఖ KGHలో మహా ప్రస్థానం అంబులెన్సు కోసం అడిగినా ఫలితంలేదని ఇలా 120 కిలోమీటర్లపాటు స్కూటీపై చంటి బిడ్డ శవాన్ని తీసుకెళ్లారు. అనారోగ్యంతో చనిపోయినవిజయనగరం జిల్లా శృంగరవరపుకోట మండలం చిట్టంపాడుకు చెందిన గంగమ్మ మృతదేహాన్ని ఆమె భర్త ఇలా బైకుపైనే 7కిలోమీటర్లు తరలించారు. మహాప్రస్థానం అంబులెన్సులు అందుబాటులో ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేదా? జగన్‌కు మానవత్వం ఉంటే ఆప్తుల మృతదేహాల్ని ఇలా భుజాన వేసుకొనో,బైకులమీదో, ఆటోల్లోనో తీసుకెళ్లాల్సిన దుస్థితి ఉండేదా?

నిజానికి ఇదో దందా ప్రైవేటు అంబులెన్సుల వాళ్లు శవాలతో చేసే వ్యాపారం మహా ప్రస్థానం అంబులెన్సులు ఎలాగూ చాలినన్ని అందుబాటులో లేవు ఇదే అదునుగా మృతుల బంధువుల్ని పీల్చిపిప్పిచేస్తారు. కడప GGHలోనూ ప్రైవేటు అంబులెన్సులదే హవా. కడప ఆసుపత్రి ICUలో మహాప్రస్థానం పోస్టర్లూ మాయం చేశారు. అలాంటి అంబులెన్సులు ఉన్నాయనే విషయం తెలియనివ్వకుండాకొన్ని ఆసుపత్రుల్లో దిగువస్థాయి సిబ్బందే ప్రైవేటు అంబులెన్సులకు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రొద్దుటూరు, మదనపల్లె జిల్లా ఆసుపత్రుల్లో ఒక్కటంటేఒక్క మహాప్రస్థానం వాహనమూ అందుబాటులో లేదు.

గిరిజన ప్రాంతాల్లోనైనే ఎవరైనా చనిపోతే ఇక బంధువుల చావుకొచ్చినట్లే గిరిజనులకు అంత చేశాం, ఇంత చేశామని డబ్బా కొట్టుకోవడం తప్ప అడవి బిడ్డలు మృతదేహాల్ని కర్రకుకట్టి వాగు, వంకలు దాటుతున్నా చలించడం లేదు. విజయనగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ‘మహాప్రస్థానం’ కింద రెండు అంబులెన్సులు ఉన్నాయి. జిల్లా విభజన అనంతరం ఒకటి పార్వతీపురానికి కేటాయిస్తామని చెప్పినా ఇవ్వలేదు. ప్రభుత్వాస్పత్రుల్లో చనిపోయిన వారి మృతదేహాల్ని ఇళ్లకు తరలించే మహాప్రస్థానం అంబులెన్సులు పెంచుతామని గొప్పలు చెప్పిన జగన్‌ వ్యవస్థను ప్రైవేటు అంబులెన్సుల మాఫియాకు వదిలేశారని ప్రజలు మండిపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story