TTD : వేదపారాయణదారుల నియామకాలపై విచారణ

TTD : వేదపారాయణదారుల నియామకాలపై విచారణ
X
టీటీడీ ఈఓ శ్యామలరావు బదిలీ కావడంతో రేపు జరగాల్సిన పాలకమండలి సమావేశం, ఈరోజు జరగాల్సిన సమీక్షా సమావేశాలు రద్దయ్యాయి. అంతేకాకుండా, 700 వేదపారాయణదారుల భర్తీలో అవకతవకలు జరిగాయని విజిలెన్స్ నివేదిక ఇవ్వడంతో, ఆ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తూ చైర్మన్ బీ.ఆర్.నాయుడు ఆదేశాలు జారీ చేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో రేపు (సెప్టెంబర్ 10) జరగాల్సిన పాలకమండలి సమావేశం రద్దయింది. టీటీడీ ఈఓగా ఉన్న శ్యామలరావు బదిలీ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనితో పాటు, ఈరోజు జరగాల్సిన విభాగాధిపతుల సమీక్షా సమావేశం కూడా రద్దు అయ్యింది.

ముఖ్యంగా, 700 వేదపారాయణదారుల భర్తీ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నియామకాల ప్రక్రియలో కొన్ని అవకతవకలు జరిగాయని విజిలెన్స్ విభాగం చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు నివేదిక సమర్పించింది. నివేదికలోని వివరాల ప్రకారం, ఈ నియామకాలలో సంబంధిత అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు స్పష్టమైంది.

దీంతో చైర్మన్ బీ.ఆర్.నాయుడు తీవ్రంగా స్పందించారు అర్హులైన బ్రాహ్మణులకు అన్యాయం జరగకుండా, ఈ పోస్టుల భర్తీని పారదర్శకంగా నిర్వహించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. త్వరలో కొత్తగా ఈ ప్రక్రియను మొదలు పెట్టనున్నట్టు తెలుస్తోంది. అయితే, చైర్మన్ వెంటనే స్పందించి నియామకాలను నిలిపివేయడం, విచారణకు ఆదేశించడం పారదర్శకతకు నిదర్శనమని భక్తులు మరియు పండితులు అభిప్రాయపడుతున్నారు

Tags

Next Story