TTD Sarvadarshanam: సర్వదర్శనం టోకెన్లు ఇక ఆఫ్‌లైన్‌లో.. అప్పటినుండే..

TTD Sarvadarshanam: సర్వదర్శనం టోకెన్లు ఇక ఆఫ్‌లైన్‌లో.. అప్పటినుండే..
X
TTD Sarvadarshanam: శ్రీవారి సామాన్య భక్తులకు.. టీటీడీ శుభవార్త చెప్పింది.

TTD Sarvadarshanam: శ్రీవారి సామాన్య భక్తులకు.. టీటీడీ శుభవార్త చెప్పింది. కోవిడ్‌ కారణంగా గతంలో నిలిపేసిన సర్వదర్శనం ఆఫ్‌లైన్‌ టోకెన్ల కేటాయింపును.. కేసులు తగ్గుమఖం పట్టడంతో తిరిగి పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈనెల 16వ తేదీ నుంచి రోజుకు 10వేల సర్వదర్శనం టోకన్లను ఆఫ్‌లైన్‌ పద్ధతిలో తిరుపతిలో భక్తులకు జారీ చేయనున్నట్లు టీటీడీ ఈవో జవహర్‌ రెడ్డి వెల్లడించారు.

ఇక ఉదయాస్తమాన సేవకు సంబంధించి.. టీటీడీ వెబ్‌ సైట్‌లో 16వ తేదీ కొత్త పోర్టల్‌ ఓపెన్‌ చేస్తామన్నారు. ఆసక్తి గల భక్తులు చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి, ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు విరాళమిచ్చే దాతలకు ఉదయాస్తమాన సేవలో వెసులబాటు కేటాయిస్తామన్నారు. ఇక ఆర్జిత సేవల పునరుద్ధరణపై రాబోయే బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామన్నారు.

Tags

Next Story