TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. సేవలు, దర్శనాల టికెట్ ధరలపై టీటీడీ నిర్ణయం..

TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. సేవలు, దర్శనాల టికెట్ ధరలపై టీటీడీ నిర్ణయం..
TTD: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్‌ ధరల పెంపుపై వెనక్కు తగ్గింది టీటీడీ.

TTD: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్‌ ధరల పెంపుపై వెనక్కు తగ్గింది టీటీడీ. సిఫార్సు లేఖలపై కేటాయించే సేవా టికెట్‌ ధరలు పెంచుతామని ఇటీవల టీటీడీ ప్రకటించింది. అయితే భక్తుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడంతో.. ధరల పెంపు ఆలోచన విరమించుకుంది. ఇప్పట్లో ఏ సేవలు, దరశనాల టిక్కెట్టు ధరలను పెంచే ఆలోచన లేదన్నారు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి.

కరోనాతో నిలిపిన ఆర్జిత సేవలన్నంటిని ఏప్రిల్‌ నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సామాన్య భక్తులకు పెద్ద పీట వేసేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందులో భాగంగా.. శుక్ర, శని, ఆదివారాలు సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్‌ దర్శనం కేటాయింపు రద్దు చేశామన్నారు. దీని వల్ల ఏ రోజుకు ఆరోజు భక్తులు స్వామివారిని దర్శించుకుంటాన్నారు.

రోజుకు 30వేల సర్వదర్శనం టోకన్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. పెరుగుతున్న రద్దీకి తగ్గట్లు ముందస్తు ఏర్పాట్లుపై ఛైర్మన్‌ తనిఖీలు చేశారు. తరిగొండ వెంబమాంబ అన్న ప్రసాద్‌ భవవానికి వెళ్లిన ఆయనదేశం నలుమూల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం టిఫిన్‌, రొట్టెలు, చపాతీలను తయారు చేసి భక్తులకు అందజేయాలని అధికారులకు ఆదేశించారు.

భక్తులందరికీ ఉచితంగా అన్న ప్రసాదం అందించాలనేదీ టీటీడీ ఆలోచనమాత్రమేనని, దీని వల్ల స్థానిక హోటల్‌ వ్యాపారలుకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపడతామన్నారు. ప్రస్తుతం కొండ ఉన్న హోటల్స్‌, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు యథావిథిగా నడుస్తాయన్నారు. భక్తులకు విరివిరిగా అన్నప్రాసాద్ అందించేందుకు పలు కౌంటర్లు ఏర్పాట్లు చేస్తామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story