TTD Special Darshan Tickets: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..! స్పెషల్ దర్శనం టికెట్లు ఇకపై..

TTD Special Darshan Tickets: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..! స్పెషల్ దర్శనం టికెట్లు ఇకపై..
TTD Special Darshan Tickets: శ్రీవారి భక్తుల కోసం దర్శన టికెట్ల సంఖ్యను పెంచుతూ TTD నిర్ణయం తీసుకుంది.

TTD Special Darshan Tickets: శ్రీవారి భక్తుల కోసం దర్శన టికెట్ల సంఖ్యను పెంచుతూ TTD నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24వ తేదీ నుంచి 28 వరకు శ్రీవారి దర్శనాలకు సంబంధించిన టికెట్లను రేపు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ నెల 24 నుంచి అదనపు కోటా కింద 13వేల దర్శన టికెట్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను రోజుకు 25వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

రేపు ఉదయం 9 గంటలకు మూడు వందల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. మార్చి నెలకు సంబంధించి సర్వదర్శన టికెట్లను రోజుకు 20 వేలకు పెంచిన TTD.. నిత్యం 5 వేల చొప్పున అదనపు కోటా కింద జారీ చేయనున్నారు. తిరుపతిలోని కౌంటర్లలో సర్వదర్శనం టికెట్లను జారీ చేయనున్నట్లు TTD వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story