TURAKAPALEM: తురకపాలెంలో మరణాలపై వీడిన మిస్టరీ.?

TURAKAPALEM: తురకపాలెంలో మరణాలపై వీడిన మిస్టరీ.?
X
తురకపాలెం నీటిలో యురేనియం అవశేషాలు.. చెన్నై ప్రయోగశాల నివేదికలో వెల్లడి... నీటిలో స్ట్రాన్షియం కూడా ఉన్నట్లు నిర్ధారణ..

గుం­టూ­రు జి­ల్లా తు­ర­క­పా­లెం గ్రా­మం­లో తీ­వ్ర అనా­రో­గ్య సమ­స్య­లు ఉత్ప­న్నం కా­వ­డా­ని­కి, అసా­ధా­రణ మర­ణా­ల­కు ప్ర­ధాన కా­ర­ణం అక్క­డి నీ­టి­లో ఉన్న యు­రే­ని­యం అవ­శే­షా­లు ఉన్న­ట్టు అధి­కా­రు­లు ని­ర్వ­హిం­చిన సమ­గ్ర అధ్య­య­నం­లో వె­ల్ల­డైం­ది. చె­న్నై సహా పలు ల్యా­బ్‌­లు ని­ర్వ­హిం­చిన పరీ­క్ష­ల్లో ఇది తే­లిం­ది. యు­రే­ని­యం­తో పాటు స్ట్రా­ని­యం అనే హా­ని­కర మూ­ల­కం ఉన్న­ట్లు గు­ర్తిం­చా­రు. నీరు, మట్టి, స్థా­ని­కుల బ్ల­డ్ శాం­పి­ల్స్ ను సే­క­రిం­చి.. చె­న్నై, ఎయి­మ్స్, గుం­టూ­రు జీ­జీ­హె­చ్ లకు పం­పిం­చిం­ది. శాం­పి­ల్స్ ను పరీ­క్షిం­చిన చె­న్నై ల్యా­బ్స్.. గ్రా­మం­లో­ని త్రా­గు­నీ­టి­లో యు­రే­ని­యం అవ­శే­షా­లు ఉన్న­ట్లు గు­ర్తిం­చి­న­ట్లు తె­లు­స్తోం­ది.

తురకపాలెంలో భయం భయం

తు­ర­క­పా­లెం­లో రెం­డు నెలల వ్య­వ­ధి­లో 30 మం­ది­కి పైగా చని­పో­వ­డం రా­ష్ట్ర వ్యా­ప్తం­గా తీ­వ్ర సం­చ­ల­నం­గా మా­రిం­ది. జ్వ­రా­లు వస్తు­న్నా­య­ని ఆస్ప­త్రి­కి తీ­సు­కె­ళ్తే మళ్లీ ఇం­టి­కి తి­రి­గొ­చ్చే వారు తక్కువ కా­వ­డం గ్రా­మ­స్థుల భయా­ల­ను పెం­చిం­ది. చి­న్న జ్వ­రా­ల­కే ప్రా­ణా­లు పో­తు­న్నా­య­ని, దీని వె­నుక ఏదో పె­ద్ద కా­ర­ణం ఉం­ద­ని తు­ర­క­పా­లెం వా­సు­లు అధి­కా­రు­ల­కు తె­లి­పా­రు. గత కొ­న్ని నె­ల­లు­గా గ్రా­మం­లో అనా­రో­గ్య సమ­స్య­లు వస్తు­న్నా­య­ని, ప్రా­ణా­లు పో­వ­డం ఆం­దో­ళన కలి­గి­స్తుం­ద­ని చె­ప్పా­రు.

క్వారీ గుంతల్లోని నీటి వల్లే...

గ్రా­మం చు­ట్టూ రా­ళ్ల క్వా­రీ­లు, వా­టి­లో­నే పరి­సర ప్రాం­తాల ప్ర­జ­లు పని­చే­స్తుం­డ­టం­తో, క్వా­రీ గుం­త­ల్లో­ని నీ­టి­ని వా­డ­టం వల్లే అనా­రో­గ్య సమ­స్య­లు చు­ట్టు­ము­ట్టి­న­ట్లు అను­మా­ని­స్తు­న్నా­రు. స్ట్రా­న్షి­యం­తో పాటు ఈకొ­లి అనే బ్యా­క్టీ­రి­యా కూడా నీ­టి­లో ఉన్న­ట్లు గు­ర్తిం­చా­ర­ని సమా­చా­రం. కాగా.. యు­రే­ని­యం శరీ­రా­ని­కి చాలా హా­ని­క­ర­మ­ని వై­ద్యు­లు చె­ప్తు­న్నా­రు. ఇది శరీ­రం­లో­కి వె­ళ్తే మూ­త్ర­పిం­డా­ల­కు తీ­ర­ని నష్టం చే­స్తుం­ద­ని, చర్మ సం­బం­ధిత సమ­స్య­లు కూడా వస్తా­య­ని హె­చ్చ­రి­స్తు­న్నా­రు. లి­వ­ర్, లం­గ్స్, బ్రె­యి­న్, బో­న్స్ డె­న్సి­టీ­ని కూడా దె­బ్బ తీ­స్తుం­ద­ని చె­ప్తు­న్నా­రు. తు­ర­క­పా­లెం­లో నీ­టి­లో స్ట్రా­న్షి­యం అనే హా­ని­కర మూ­ల­కం మరి­యు ఈకొ­లి బ్యా­క్టీ­రి­యా కూడా ఉన్న­ట్లు చె­న్నై ని­వే­ది­క­లో తే­లిం­ది. అయి­తే, మొ­ద­టి­సా­రి­గా ని­ర్వ­హిం­చిన పరీ­క్ష­ల్లో మా­త్రం బ్యా­క్టీ­రి­యా ఒకే­చో­టే ఉన్న­ట్లు గు­ర్తిం­చా­రు. ఈ వి­ష­యం­పై చె­న్నై ని­వే­దిక ఫలి­తా­లు కొంత భి­న్నం­గా వచ్చా­య­ని అధి­కా­రు­లు తె­లి­పా­రు. యు­రే­ని­యం మానవ శరీ­రా­ని­కి ఎంతో ప్ర­మా­ద­క­రం అని డా­క్ట­ర్లు చె­బు­తు­న్నా­రు. ఇది ­నీ­రు లేదా ఆహార మా­ర్గం­లో శరీ­రం­లో­కి ప్ర­వే­శి­స్తే మొ­ద­ట­గా మూ­త్ర­పిం­డా­ల­కు తీ­వ్ర నష్టం కలు­గు­తుం­ది. కా­లే­యం, మె­ద­డు, ఊపి­రి­తి­త్తు­లు, ఎము­క­ల­కు దె­బ్బ­తీ­సి ప్రా­ణాం­త­కం­గా మారే అవ­కా­శం ఉం­ద­ని వై­ద్య ని­పు­ణు­లు హె­చ్చ­రిం­చా­రు.

Tags

Next Story