రాజద్రోహం కేసులో ఏపీ ప్రభుత్వం చేసిన ఆరోపణలను ఖండించిన TV5 యాజమాన్యం..!

రాజద్రోహం కేసులో ఏపీ ప్రభుత్వం చేసిన ఆరోపణలను ఖండించిన TV5 యాజమాన్యం..!
TV5: రాజద్రోహం కేసులో న్యూస్ ఛానల్ టీవి5పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన తప్పుడు ఆరోపణలను యాజమాన్యం ఖండించింది.

రాజద్రోహం కేసులో న్యూస్ ఛానల్ టీవి5పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన తప్పుడు ఆరోపణలను యాజమాన్యం ఖండించింది. రాఘురామతో టీవీ5 ఒంప్పందాలు చేసుకుందని ఆరోపిస్తున్న ఏపీ సీఐడి అఫిడవిట్ లో ఎంత మాత్రం నిజం లేదని పేర్కొంది. సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొన్న అంశాలు అసత్యాలు మాత్రమే అని తెలిపింది. 2016లో రఘురామతో టీవీ5కి ఆర్ధిక లావాదేవీ జరిగినట్లు వస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని టీవీ5 యాజమాన్యం ఖండించింది.

వైసీపీ రెబల్ ఎంపీ రాఘురామకృష్ణం రాజుతో టీవీ5 సంస్థకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని యాజమాన్యం తెలిపింది. ప్రజల కోసం పనిచేసే టీవీ5కు ఎవరితో ఆర్థిక లావాదేవీలు చేసుకోవాల్సిన అవసరం లేదని మరోసారి స్పష్టం చేసింది.

తప్పుడు అఫిడవిట్ తో సుప్రీం కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని టీవీ5 యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అఫిడవిట్ దాఖలు చేసిన సీఐడి అధికారులపై పరువునష్టం దావా వేయనున్నట్లు టీవీ5 యాజమాన్యం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమపై చేసిన ఆరోపణలను న్యాయపరంగా ఎదుర్కొంటామని.. వాస్తవాలను సుప్రీం కోర్టుకు నివేదిస్తామని టీవి5 యాజమాన్యం స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story