Viveka Murder Case : ట్విస్ట్.. వివేకా నిందితుల జాబితా నుంచి దస్తగిరి పేరు తొలగింపు

Viveka Murder Case : ట్విస్ట్.. వివేకా నిందితుల జాబితా నుంచి దస్తగిరి పేరు తొలగింపు
X

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుల జాబితా నుంచి నాలుగో నిందితుడిగా ఉన్న దస్తగిరి పేరును కేంద్ర దర్యాప్తు సంస్థ న్యాయస్థానం (సీబీఐ కోర్టు) తొలగించింది.

తనను నిందితుడిగా కాకుండా సాక్షిగా మాత్రమే పరిగణించాలని సీబీఐ కోర్టులో దస్తగిరి ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను గురువారం కోర్టు స్వీక రించింది. ఈ క్రమంలో సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు.. దస్తగిరి పేరును తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే సీబీఐ అధికారులు దాఖలు చేసిన అభియోగపత్రంలోనూ తనను సాక్షిగా చేర్చిన విషయాన్ని కూడా దస్తగిరి పేర్కొన్నారు.

దస్తగిరి వాదనలను పరిగణలోనికి తీసుకున్న సీబీఐ కోర్టు నిందితుల జాబితా నుంచి పేరు తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. 2019 మార్చి 14 అర్థరాత్రి పులివెందులలోని సొంత గృహంలో వైఎస్ వివేకా దారుణ హత్యకు గురైన విషయం సంచలనం రేపుతూనే ఉంది.

Tags

Next Story