Andhra Pradesh : అభివృద్ధి అంటున్న కూటమి.. రప్పా రప్పా అంటున్న వైసీపీ

ఏపీలో రెండు రకాల విధానాలు మనకు కనిపిస్తున్నాయి. రాజధాని పూర్తి స్థాయిలో లేకుండా ఇబ్బంది పడుతున్న రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే చంద్రబాబు నాయకత్వంలోని కూటమి గాడిన పెడుతోంది. వైసీపీ సర్వనాశనం చేస్తే.. పెట్టుబడులు తీసుకొస్తూ ఏపీని అన్ని రకాలుగా కూటమి అభివృద్ధి పథంలో నడిపిస్తోంది. అటు సంక్షేమాన్ని బ్యానెల్స్ చేస్తూ.. ఇంకోవైపు ప్రభుత్వ విధానాలతో ఏపీని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇందులో భాగంగా ఎన్నో రకాల కంపెనీలను ఏపీకి తీసుకొస్తూ అభివృద్ధి పథంలో ఏపీని నడిపిస్తున్నారు. ఇందుకోసం కేంద్ర సాయం తీసుకుంటూ మిగతా రాష్ట్రాల కంటే వేగంగా ఏపీని అభివృద్ధిలో నడిపిస్తూ తన విజనరీని చూపిస్తున్నారు.
కానీ వైసీపీ మాత్రం అలా కాదు. కేవలం రప్పా రప్పా అంటూ రెచ్చిపోతోంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా రప్పా రప్పా నరికేస్తాం అంటూ వార్నింగులు ఇస్తోంది. ఏపీ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతూ రెచ్చిపోతోంది వైసీపీ బ్యాచ్. పొట్టేళ్లను నరికేస్తూ జగన్ ఫ్లెక్సీకి రక్తాభిషేకాలు చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. ఇక వీళ్లు గనక నిజంగానే అధికారంలోకి వస్తే మనుషులను ఇలాగే నరికేస్తారేమో అని ఏపీ ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ప్రపంచమంతా టెక్నాలజీ, డెవలప్ మెంట్ వైపు వెళ్తుంటే జగన్ మాత్రం ఇలా కక్ష రాజకీయాలకు తెర తీస్తున్నారు.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే చాలా విషయాల్లో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అంతే గానీ ఎలాంటి కక్ష రాజకీయాలకు తావు ఇవ్వట్లేదు. కేవలం ఏపీ అభివృద్ధి మాత్రమే తమ లక్ష్యం అని పదే పదే చెబుతున్నారు. అందుకోసం ఏం చేయడానికైనా సిద్ధమే అంటున్నారు. వైసీపీ బెదిరింపులను సహించేది లేదని.. పెట్టుబడిదారులను బెదిరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

