Prakasham : ఇద్దరమ్మాయిల ప్రేమ, పెళ్లి .. పోలీసుల విచారణలో దిమ్మతిరిగే వాస్తవాలు

Prakasham : ప్రకాశం జిల్లా ఒంగోలులో యువతుల ప్రేమ వివాహం వివాదస్పదంగా మారింది. తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పంచాయితీ పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఒంగోలు వన్ టౌన్ పోలీసులు యువతులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా వాళ్లు మనసు మార్చుకోకపోవడంతో పోలీసులు తల పట్టుకుంటున్నారు. ఒకరిని విడిచి మరొకరం ఉండలేమంటుూ తెగేసి చెబుతున్నారు యువతులు. వేరేవాళ్లతో పెళ్లిచేస్తే ఆత్మహత్య చేసుకుంటామంటూ బెదిరింపులకు దిగుతున్నారు.
ఇక రమ్యకు 19ఏళ్లు, సుమలతకు 32 ఏళ్లు. రమ్యది అమరావతి నగర్, సుమలతది జాలిపాలెం... కొత్తపట్నం బీచ్ దగ్గర పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమ ఆతర్వాత పెళ్లి వరకు వచ్చింది. జనవరి 14 సంక్రాంతి రోజున వీళ్లు వివాహం చేసుకున్నారు. రంగుతోటలో ఇల్లు అద్దెకు తీసుకోని 2నెలలుగా ఉంటున్నారు. విషయం ఇంట్లో తెలియడంతో వాళ్లు పోలీసులను ఆశ్రయించారు.
యువతుల ప్రేమ వివాహంలో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. పోలీసు విచారణలో దిమ్మతిరిగే వాస్తవాలు తెలుస్తున్నాయి. ఈ యువతుల్లో ఒకరైన సుమలత గతంలో ఓసారి జైలుకు వెళ్లొచ్చినట్లు గుర్తించారు. యువతులపై లైంగికదాడి కేసులో ఆమె జైలుకు వెళ్లొచ్చినట్లు చెబుతున్నారు. గతంలో సుమలత గదిలో పురుషుల విగ్గులు, ఇతర సామాగ్రి బయటపడ్డ సంచలనం సృష్టించింది. ఇక సుమలతకు గతంలోనే పెళ్లికూడా అయింది.
ఈ విపరీతమైన తీరుతో మనస్తాపం చెందిన సుమలత భర్త గతంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సుమలతే... తాజాగా మరో యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకోడం తీవ్ర చర్చనీయాంశమైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com