Visakha Road Accident: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాప్ట్‌వేర్ ఇంజనీర్లు దుర్మరణం..

VinodKhanna, DhanRaj (tv5news.in)
Visakha Road Accident: విశాఖ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాప్ట్‌వేర్ ఇంజనీర్లు ప్రాణాలు కోల్పోయారు. పీఎం పాలెం క్రికెట్ స్టేడియం సమీపంలోని వీ కన్వెన్షన్ హాల్ ఎదురుగా మంగళవారం అర్థరాత్రి గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు ధనరాజ్ (22), కె.వినోద్ ఖన్నా (22) గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధనరాజ్ ఇన్ఫోసిస్‌లో, వినోద్ ఖన్నా లోకల్‌లో ఉన్న ఓ సాప్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నారు. మంగళవారం రాత్రి మారికవలసలోని శారదానగర్-2 ప్రాంతానికి చెందిన ధనరాజ్, స్వతంత్ర నగర్‌కు చెందిన వినోద్ కన్నా కలసి పనోరమ హిల్స్‌లో ఉన్న స్నేహితుడిని కలిసి అతడి పుట్టిన రోజు వేడుకల్లో పాలు పంచుకున్నారు.
అక్కడి నుంచి పెట్రోల్ బంక్‌కు వెళ్లి బైక్‌లో పెట్రోల్ పోయించుకున్నారు. తిరిగి స్నేహితుడి ఇంటికి వెళదామనుకునేలోపు గుర్తు తెలియని వాహనం వాళ్ల బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ధనరాజ్, వినోద్ ఖన్నా అక్కడికక్కడే మృతి చెందారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com