floods: నేడు తెలంగాణలో కేంద్రమంత్రుల పర్యటన
తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు కేంద్ర మంత్రులు ఖమ్మంలో పర్యటిస్తారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు కేంద్ర మంత్రులు ఖమ్మంలో పర్యటిస్తారు.
తొలుత ఖమ్మం జిల్లాలో ఏరియల్ సర్వే ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు కోదాడకు బండి సంజయ్ వెళ్లి అక్కడి వరద బాధితులను సమస్యలు అడిగి తెలుసుకుంటారు. పార్టీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు తదితరులు సంజయ్‌తో పాటు వరద ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఎంపీ ఈటల రాజేందర్ నేతృత్వంలో, పార్టీ నాయకులు ములుగు, మహబూబాబాద్ ప్రాంతాల్లో వరద బాధితులను పరామర్శిస్తారు.
నేడు వారి అకౌంట్లలోకి రూ.10 వేలు
ఇటీవల కురిసిన వర్షాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా అతలాకుతలమైన సంగతి తెలిసిందే. దీంతో ముంపునకు గురైన గ్రామాల బాధితులకు తక్షణ సాయంగా నేటి నుంచి వారి ఖాతాల్లో రూ.10 వేల నగదు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, పాడి పశువులు చనిపోతే రూ.50 వేలు, మేకలు, గొర్రెలు మరణిస్తే రూ.5 వేలు ఇస్తామని వెల్లడించారు.
భారీ నష్టం
ఖమ్మంలో అకస్మాత్తుగా భారీ వరద రావడంతో షెడ్లలో నిలిపిన కార్లు, పెద్దసంఖ్యలో ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. ద్విచక్ర వాహనాలు, లారీలు, కార్ల ఇంజిన్లు, ఇంధన ట్యాంకుల్లోకి నీరు చేరింది. ఒక్కో లారీకి రూ.50 వేల వరకు నష్టం కలిగిందని డ్రైవర్లు, యజమానులు వాపోతున్నారు. ఖరీదైన కార్లకు రూ.లక్ష వరకు నష్టం వచ్చింది. ఆటోమొబైల్ దుకాణాల్లో విడిగా విక్రయించే ఆయిల్స్ డ్రమ్ముల్లోకి బురద చేరింది. విడిభాగాలు కొన్ని దెబ్బతినగా.. మరికొన్ని కొట్టుకుపోయాయి. ఒక్కో దుకాణానికి రూ.రెండు లక్షల నుంచి రూ.మూడు లక్షల నష్టం వాటిల్లిందని శ్రీనివాస్ తెలిపారు. మరమ్మతులకు ఇచ్చిన వాహనాలు కొట్టుకుపోవడంతో వాటి యజమానులు తమపై ఒత్తిడి తెస్తున్నారని మెకానిక్‌లు వాపోతున్నారు. ప్రభుత్వం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. మరోవైపు, చెడిపోయిన వాహనాల మరమ్మతులకు రూ.వేలల్లో వ్యయం అవుతుండటంతో వాహనదారులు జేబులు తడుముకుంటున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com