sunil kumar : ఐపీఎస్ సునీల్ కుమార్‌పై చర్యలకు కేంద్ర హోంశాఖ ఆదేశం

IPS అధికారి పీవీ సునీల్ కుమార్‌పై ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకోని అందుకు సంబంధించిన నివేదిక సమర్పించాలని కేంద్ర హోం శాఖ.. ఏపీ చీఫ్ సెక్రటరీకి లేఖ రాసింది. 20 ఏళ్ల పాటు కాపురం చేసిన భార్యను దారుణంగా వేధిస్తున్నందుకు ఆయనపై గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేశారని....దానికి సంబంధించి తెలంగాణ పోలీసులు ఛార్జీషీటు దాఖలు చేశారని పేర్కొంటు ఈ నెల 8న కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు లేఖ రాశారు రఘురామ. త్వరలో ఆ కేసు ట్రయల్ ప్రారంభం కాబోతుందన్నారు.
ఇలాంటి నేపథ్యం ఉన్న అధికారికి మహిళలపై జరిగే వేధింపుల నిరోధానికి ఉద్దేశించిన దిశ చట్ట పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడం అంటే మహిళల భద్రతను కాలరాయడమేనన్నారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని తగు చర్యలు తీసుకోవాలన్నారు. సునీల్ కుమార్ తన కుటుంబసభ్యులను విపరీతంగా వేధిస్తూ, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి తమ హత్యకు కుట్ర పన్నుతారని పేర్కొంటూ ఏపీ హైకోర్టు ముందు ఆయన మామ అఫిడవిట్ దాఖలు చేసినట్లు రఘురామకృష్ణం రాజు గుర్తుచేశారు.
సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా అంబేద్కర్స్ మిషన్ ఏర్పాటు చేసి జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి విరాళాలు వసూలు చేస్తున్న అంశంపై ప్రత్యేక బృందంతో దర్యాప్తు జరిపించాలని రఘురామకృష్ణరాజు కోరారు. ఈ ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకుని, తమకు చర్యా వేదిక సమర్పించమని కోరుతూ తాజాగా కేంద్ర హోంశాఖ ఏపీ చీఫ్ సెక్రటరీకి లేఖ రాసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com