Jogi Ramesh : జోగి రమేష్ కు కానరాని సింపతి..

వైసిపి మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన అరాచకాలకు ఇప్పుడు పాపం పండింది. కల్తీ లిక్కర్ దందా వందలాది మంది ప్రాణాలను తీసుకుంది. అలాంటి దందా చేసి వందల కోట్లు సంపాదించుకోవాలని అనుకున్న జోగి రమేష్ ను ఇప్పటికే సిట్ అధికారులు అరెస్టు చేశారు. అయితే ముందు నుంచి జోగి రమేష్ సింపతి కార్డు వాడుతూ వస్తున్నాడు. ఏకంగా దుర్గామాత ఆలయానికి వెళ్లి తాను తప్పు చేయలేదని ప్రమాణం చేసి.. ప్రజల నుంచి మద్దతు పొందాలని ప్లాన్ చేశాడు. కానీ దొంగ ప్రమాణాలు చేస్తే అధికారులు అరెస్టు చేయకుండా ఉండరు కదా. సాక్షాలు బలంగా ఉన్నాయి కాబట్టే జోగి రమేష్ ను అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన తర్వాత కూడా జోగి రమేష్ చాలా సింపతి కార్డుకు ప్లాన్ చేశాడు.
తనను అరెస్టు చేస్తే బీసీలను తొక్కేయడం అన్నట్టు పెద్ద పెద్ద డైలాగులు వాడేశాడు. అంతేకాకుండా జోగి రమేష్ కొడుకులు తమ కులం స్పందించాలి.. ఇది తమ కులానికి జరుగుతున్న అన్యాయం అన్నట్టు ఓవర్ రేంజ్ కామెంట్లు చేశారు. కానీ జోగి రమేష్ కు అటు తన సామాజిక వర్గం నుంచి గాని.. ఇటు వైసిపి పార్టీ నుంచి గాని ఎలాంటి సింపతి రాలేదు. ఆయన్ను అరెస్టు చేస్తే రాష్ట్రవ్యాప్తంగా వైసిపి ధర్నాలు చేస్తుందని.. జగన్ ఊరుకోకుండా ఏదో ఏదో చేసేస్తాడని చాలానే ఊహించుకున్నాడు.
కానీ వైసీపీ పార్టీలో ఎవ్వరూ ఆయన అరెస్టుపై పెద్దగా స్పందించట్లేదు. ఇక జగన్ అయితే కనీసం మాట వరసకు కూడా జోగి రమేష్ అరెస్టుపై స్పందించకుండా.. ఎక్కువ మాట్లాడితే ఈ కేసులో తాను ఇరుక్కుంటానేమో అన్న భయంతో సైలెంట్ గా ఉండిపోయాడు. అటు జోగి రమేష్ సామాజిక వర్గం అయితే.. అతనితో మాకు సంబంధం లేదు అన్నట్టు పక్కన పెట్టేసింది. దెబ్బకు జోగి రమేష్ సింపతి ప్లాన్ అట్టర్ ప్లాప్ అయింది. మంచి పనులు చేసిన వారికి అన్ని వర్గాల నుంచి మద్దతు ఉంటుంది. కానీ తప్పుడు దందాలు చేసి కోట్లు సంపాదించుకోవాలనుకున్న వారికి మద్దతు ఎలా వస్తుంది. దీన్నిబట్టి జోగి రమేష్ అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం అవుతున్నాయి అంటున్నారు కూటమి నేతలు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

