VAARAHI YATRA: నేటి నుంచే రెండో విడిత యాత్ర ప్రారంభం

VAARAHI YATRA: నేటి నుంచే రెండో విడిత యాత్ర ప్రారంభం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండో విడిత వారాహి యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండో విడిత వారాహి యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ్టి నుంచి 12వ తేదీ వరకు ఏలూరు జిల్లాలో పవన్ పర్యటించనున్నారు. ఏలూరు, దెందులూరు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ యాత్ర కొనసాగనుంది. గత నెలలో వారాహి యాత్ర మొదటి షెడ్యూల్ విజయవంతం పూర్తి చేసుకున్నారు పవన్. సాయంత్రం ఐదు గంటలకు వారాహి యాత్ర ప్రారంభం అవుతుంది. ఇక వారాహి యాత్రలో భాగంగా ఏలూరులో నేడు బహిరంగ సభ జరగనుంది. రేపు జనవాణి కార్యక్రమంలో ప్రజా సమస్యలు తెలుసుకుంటారు. మంగవారం సాయంత్రం పార్టీ నేతల సమావేశం అవుతారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ యాత్రలో రెండు బహిరంగ సభల్లో పవన్ పాల్గొంటారు.

Tags

Read MoreRead Less
Next Story