Vangaveeti Radha: గుడివాడ బరిలోకి వంగవీటి రాధ ఎంట్రీ తప్పదా..?

Vangaveeti Radha: గుడివాడ బరిలోకి వంగవీటి రాధ ఎంట్రీ తప్పదా..?
Vangaveeti Radha:దేవినేని వర్గీయులతో మంత్రి కొడాలి నాని సన్నిహితంగా ఉండడాన్ని వంగవీటి అభిమానులు జీర్ణీంచుకోలేకపోతున్నారు

Vangaveeti Radha: గుడివాడ బరిలోకి వంగవీటి రాధ ఎంట్రీ తప్పదా..? తన సన్నిహితులు, గుడివాడ స్ధానికులతో రాధ విస్తృతంగా మంతనాలు జరపడం వెనక ప్లాన్ ఏంటి? ఇప్పటికే గుడివాడ బరిలో దిగాలని రాధపై ఒత్తిడి పెరిగింది. వంగవీటి రాధాకు గుడివాడ వాసులు అల్టిమేటమ్ కూడా ఇచ్చారు. అసలే మంత్రి కొడాలి నాని తీరుపై వంగవీటి అభిమానుల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

దేవినేని వర్గీయులతో మంత్రి కొడాలి నాని సన్నిహితంగా ఉండడాన్ని వంగవీటి అభిమానులు అస్సలు జీర్ణీంచుకోలేకపోతున్నారు. అందుకే, ఈసారి గుడివాడలో పోటీకి దిగాల్సిందేనని వంగవీటిపై ప్రెజర్ తీసుకొస్తున్నారు. ఒకవేళ వంగవీటి రాధ ఎంట్రీ ఇస్తే.. గుడివాడ రాజకీయం రసకందాయంలో పడడం ఖాయం. స్వయంగా గుడివాడ వాసులే వంగవీటి రాధాను రమ్మని పిలుస్తున్నారు.

మరోవైపు కొడాలి నానిపై తీవ్ర అసంతృప్తి వెల్లువెత్తుతోంది. క్యాడర్‌ కూడా కొడాలికి దూరమైంది. గుడివాడ యువత సైతం మంత్రి కొడాలి నాని వ్యవహారశైలి అస్సలు బాగోలేదని బహిరంగ విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా వంగవీటి రాధా అభిమానులైతే కొడాలి నానిపై కారాలు, మిరియాలు నూరుతున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత కొడాలి నాని అసలు స్వరూపం బయటపడిందని కామెంట్ చేస్తున్నారు.

ముఖ్యంగా దేవినేని వర్గీయులు మంత్రి కొడాలి నానితో సాన్నిహిత్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. గుడివాడ ప్రజలు సైతం.. కొడాలి నానిని 15 ఏళ్ల పాటు తమ భుజాల మీద మోసి తప్పు చేశామంటున్నారు. ఇప్పటికైనా చేసిన తప్పు సరిదిద్దుకోకపోతే చరిత్ర క్షమించదన్న నిర్ణయానికి వచ్చారు. అందుకే, గుడివాడలో ప్రత్నామ్నాయ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారు. ఇందుకు వంగవీటి రాధానే సరైన అభ్యర్ధిగా భావిస్తున్నారు గుడివాడ వాసులు.

ఈ విషయంలో వంగవీటి మాట కూడా వినేది లేదని అల్టిమేట్టం ఇస్తున్నారు. 15 ఏళ్లుగా వంగవీటి రాధా చెప్పారనే, వంగవీటికి స్నేహితుడిగా ఉన్నారనే ఒకే ఒక్క కారణంతో కొడాలి నానిని గెలిపిస్తూ వచ్చామని, ఇక తమ ఓపిక కూడా నశించిందని చెబుతున్నారు. కొడాలితో స్నేహబంధం కావాలో, తమతో ఆత్మబంధం కావాలో తేల్చుకోవాలంటూ వంగవీటి అభిమానులు సైతం రాధాకు ఒక డెడ్‌లైన్‌ విధించారు.

ఓవైపు నియోజకవర్గ ప్రజలు, మరోవైపు వంగవీటి అభిమానులు, అనుచరులు ఒకేరకమైన డిమాండ్‌ చేస్తుండడంతో వంగవీటి రాధాకృష్ణ సంకటస్ధితిలో పడ్డారు. ప్రజలను, వంగవీటి అభిమానుల విజ్ఞప్తిని కాదనలేని స్ధితిలో ఉన్నారు రాధా. స్నేహం ముసుగులో ఇప్పటిదాక కొందరు.. వారివారి రాజకీయ లబ్ది కోసం వంగవీటి పేరును, వంగవీటి కుటుంబంపై ఉన్న గౌరవాన్ని వాడుకున్నారని స్వయంగా రాధా ముందే కుండబద్దలు కొట్టి చెప్పారు అనుచరులు.

ఇకపై అభిమానుల మాటకే ప్రాధాన్యం ఇవ్వాలని అనుచరులు సైతం సూచన చేశారు. కాని, వంగవీటి రాధాకు మాత్రం విజయవాడ వదిలి వెళ్లడం ఇష్టం లేదని తెలుస్తోంది. కావాలంటే గుడివాడలో స్ధానికంగా ఉండే ఎవరికైనా మద్దతిద్దాం అని రాధా తన అనుచరులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే, స్వయంగా గుడివాడ వాసులే బరిలోకి దిగమని వేడుకుంటుంటే.. మరో ప్రత్నామ్నాయంపై దృష్టి పెట్టడం సమంజసం కాదని వంగవీటి రాధా అనుచరులు తేల్చి చెప్పేశారు.

దీంతో గుడివాడ బరిలో దిగక తప్పని పరిస్ధితులు ఏర్పడ్డాయని వంగవీటి తన సన్నిహితులతో చెప్పినట్టు తెలుస్తోంది. కాకపోతే, సరైన నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం కావాలంటున్నారు రాధా. మొత్తానికి వంగవీటి ఎంట్రీతో గుడివాడ రాజకీయం రసకందాయంలో పడింది.

Tags

Read MoreRead Less
Next Story