వివేకా హత్య జరిగిన రోజే హంతకులెవరో జగన్‌కు తెలుసు: వర్ల రామయ్య

వివేకా హత్య జరిగిన రోజే హంతకులెవరో జగన్‌కు తెలుసు: వర్ల రామయ్య
X
Varla Ramaiah : వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజే హంతకులు ఎవరో సీఎం జగన్‌కు తెలుసన్నారు టీపీడీ సీనియర్ నేత వర్ల రామయ్య.

Varla Ramaiah : వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజే హంతకులు ఎవరో సీఎం జగన్‌కు తెలుసన్నారు టీపీడీ సీనియర్ నేత వర్ల రామయ్య. ఆనాడూ ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ నాటకాలాడారని విమర్శించారు. వివేకా హత్యకు 40 కోట్లు సుపారీ ఇచ్చింది ఎవరో తెలిసి కూడా ఆనాటి ప్రభుత్వంపై జగన్‌ నెపం నెట్టారని ఆరోపించారు. అధికారం కోసం బాబాయ్‌ హత్యను జగన్‌ వాడుకున్నారని విమర్శించారు. వివేకా హత్య గురించి తెలియదని జగన్ ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. వివేకా హత్యతో జగన్ కుటుంబం రెండుగా చీలిందన్నారు. హంతకులు ఎవరనేది తెలిసినా...జగన్ రెండున్నరేళ్లుగా మౌనంగా ఉన్నారన్నారు మాజీ హోంమంత్రి చినరాజప్ప. ఇప్పటికైనా వివేకా హంతకులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Tags

Next Story