Tomatoes Price : మార్కెట్ లో మండిపోతున్న కూరగాయల ధరలు టమోటా కిలో రూ.100

మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. దాదాపు అన్ని కూరగాయలూ సెంచరీ మార్క్‌కు చేరువ అవుతున్నాయి. ధరలతో సామాన్యులు తిప్పలు పడుతున్నారు. వారి స్తోమతలో కూరగాయలు కొనలేని పరిస్థితి నెలకొంది. గడిచిన వారం రోజులుగా టమోటా ధర రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. పెరుగుతున్న టమోటా ధరతో వినియోగదారులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు సైతం విపరీతంగా పెరగడంతో.. పూట గడవని స్థితిలో వినియోగదారులు ఉన్నారు. ఇప్పుడు కూరగాయాల ధరలు పెరగడంతో జనాలు ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. ధరలు ఎప్పుడు తగ్గుతాయా? అని ఆశగా వినియోగదారులు ఎదురుచూస్తున్నారు. వర్షాల వలన దిగుబడి తగ్గడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలో కూరగాయాల ధరలు ఏకంగా రూ.100కు చేరువలో ఉన్నాయి. ఇప్పటికే టమోటా రూ.100 పలుకుతోంది. ఏపీ, తెలంగాణలో గత వారం ఉల్లి కేజీ రూ.60 ఉండగా.. ఇప్పుడు రూ.80కి చేరింది. టమోటా గతవారం కేజీ రూ.50 నుంచి60 మధ్యలో ఉండగా..కొన్ని ప్రాంతాల్లో రూ.100 పలుకుంది. మరికొన్ని ప్రాంతాల్లో రూ.80 నుంచి 90 మధ్య పలుకుతోంది. దసరా పండుగ నాటికి అన్ని కూరగాయాలు రూ.100 చేరువ కావొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com