AP : తెలుగు వాళ్లు తెలుగులోనే మాట్లాడాలి.. వెంకయ్య, పవన్ హాట్ కామెంట్స్

AP : తెలుగు వాళ్లు తెలుగులోనే మాట్లాడాలి.. వెంకయ్య, పవన్ హాట్ కామెంట్స్

తెలుగు వాడినైనందుకు ఎంతో గర్వపడుతున్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. భాషా ప్రాచీనతకు శాసనాలు మూలాధారాలు అని ఆయన తెలిపారు. ఇంగ్లీష్ మాట్లాడితేనే గొప్పతనం రాదని.. తెలుగు వాళ్లు తెలుగు భాషలోనే మాట్లాడాలన్నారు. గిడుగు వెంకట రామమూర్తి పుట్టినరోజును తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.

కడప జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం కల్లమల్ల గ్రామంలో జరిగిన తెలుగుభాష దినోత్సవంలో వెంకయ్యనాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. గిడుగు అంటే పిడుగు అన్న పేరును ఆయన సంపాదించుకున్నారని తెలిపారు.

Tags

Next Story