Andhra Pradesh : ఇవాళ సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌కు విడదల రజిని , అంబటి..

వైసీపీ మాజీ మంత్రులు విడదల రజిని , అంబటి రాంబాబు.. ఇవాళ సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లనున్నారు. రెంటపాళ్లలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా జరిగిన ఘటనపై పోలీసులు వారిని ప్రశ్నించనున్నారు. వారి స్టేట్‌మెంట్ రికార్డ్ చేయనున్నారు. జగన్ టూర్ సందర్భంగా పోలీసుల విధులకు అడ్డుపడ్డారంటూ అంబటి రాంబాబుపై కేసు నమోదు అయ్యింది. దీంతో ఇవాళ విచారణకు రావాలని ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నోటిసుల నేపథ్యంలో అంబటి స్టేషన్‌కు వెళ్లనున్నారు. అదేవిధంగా నిబంధనలను ఉల్లంఘించినట్లు పోలీసులు మాజీ మంత్రి విడదల రజినీపై కేసు నమోదు చేశారు. దీంతో ఆమెను కూడా విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఈ ఇద్దరి విచారణల నేపథ్యంలో సత్తెనపల్లిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com