కుళ్ళిన మాంసం.. విశాఖ హోటళ్ల బాగోతం

కుళ్ళిన మాంసం.. విశాఖ హోటళ్ల బాగోతం
X
కుళ్ళిన మాంసం, నిల్వ ఉంచిన పదార్థాలు, క్యాన్సర్ కారకాలతో హోటళ్ల నిర్వహాకులు జనం ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు.

విశాఖ హోటళ్లలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. కుళ్ళిన మాంసం, నిల్వ ఉంచిన పదార్థాలు, క్యాన్సర్ కారకాలతో హోటళ్ల నిర్వహాకులు జనం ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. ఆన్ లైన్ ద్వారా వచ్చే ఫుడ్‌ కూడా ప్రమాదకారంగానే మారింది. విషయం తెలియని జనం ఆ ప్రమాదకరమైన ఫుడ్‌ రుచిని ఆస్వాదిస్తున్నారు. విజిలెన్స్ తనిఖీలతో విశాఖ హోటళ్ల బాగోతం బట్టబయలైంది.పలు హోటళ్లపై విజిలెన్స్, ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారుల దాడులు చేశారు.

ఈ దాడుల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. మూడ్రోజుల కిందట వండిన ఆహార పదార్థాలనూ గుర్తించారు. రంగు, రుచి కోసం క్యాన్సర్‌ కారక రంగులను వాడుతున్నారు. నెల్లూరు మెస్, 72 బిరియానీస్, పద్మావతి స్టీల్ డబ్బా బిరియానీ పాయింట్లకు అధికారులు జరిమానా విధించారు. ఆహారం నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. విశాఖలో ఆహార పదార్థాల తయారీలో నాణ్యత పాటించని హోటళ్లు ఎన్నో ఉన్నాయి.నాణ్యత పాటించని హోటళ్లపై చర్యల తీసుకోవాలని నగరవాసుల డిమాండ్ చేస్తున్నారు.

Tags

Next Story