Vigilance Raids : వెంకటగిరిలో విజిలెన్స్ దాడులు.. రెండు ఫర్టిలైజర్ షాపులు సీజ్

ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో డైరెక్టర్ అగ్రికల్చర్ విజయవాడ వారి ఆదేశాలు మేరకు జిల్లా జిల్లా విజిలెన్స్ అధికారులు సహకారంతో అగ్రికల్చర్ అధికారులతో ఉమ్మడిగా కలిసి జిల్లాలో 30 బృందాలు తో వ్యవసాయ ఎరువులు ఫర్టిలైజర్ దుకాణాలు తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది అని ఇంజిలెన్స్ సిఐ నరసింహారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వెంకటగిరి మండలం లోని వ్యవసాయ ఎరువులు దుకాణాలు మరియు నవత ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో తనిఖీ నిర్వహించాము. పట్టణంలోని వ్యవసాయ ఎరువులు షాపులు తనిఖీ నిర్వహించగా శ్రీ వెంకటేశ్వర ఫెర్టిలైజర్ షాప్ లో రూ 67 లక్షల విలువైన ఎరువులు రికార్డులు తేడా ఉండడంతో రెండు షాపు ఎరువులు సీజ్ చేయడం జరిగింది. మరో సాయిబాబా రైతు డిపో తనిఖీలు నిర్వహించగా 11 లక్షలు ఎరువులు రికార్డులో నమోదు కాకపోవడంతో సీజ్ చేయటం జరిగింది. పట్టణంలోని రెండు షాపులో సుమారు 78 లక్షల విలువైన ఎరువుల మందులు ఛీ చేయడం జరిగింది అని అన్నారు. వ్యవసాయ అగ్రికల్చర్ విజిలెన్స్ అధికారి ఆంజనేయులు మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు ప్రభుత్వం కేటాయించిన ధరలకు మాత్రమే విక్రయించుకోవాలని ప్రతి రైతుకు రసీదు తో పాటు మందులు పంపిణీ చేయాలని ఫర్టిలైజర్ ఎరువుల దుకాణ యాజమాన్యం కు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సంచాలకులు అనసూయ వ్యవసాయ అధికారులు సుజాత ప్రవీణ, పాల్గొన్నారు
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com