VIJAYAMMA: అన్నా-చెల్లి మధ్య ఇరుక్కుపోయా: వైఎస్ విజయమ్మ

వైఎస్ విజయమ్మ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. చెన్నైలోని నేషనల్ కంపెనీ లా అప్పీలెట్ ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ)కు విజయమ్మ సమర్పించిన నివేదిక ఇప్పుడు సంచలనంగా మారింది. జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్ బెంచ్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేయడం షర్మిలకు, ఆయనకు మధ్య ఉన్న రాజకీయ కలహాలను పరిష్కరించుకునే ప్రయత్నం తప్ప మరోటి కాదంటూ విజయమ్మ ఎన్‌సీఎల్‌ఏటీకు నివేదించారు. ఇద్దరూ తన పిల్లలు కావడంతో వారి రాజకీయ గొడవల్లో చిక్కుకున్నానని పేర్కొన్నారు. కుటుంబ వివాదానికి కార్పొరేట్ రంగు పులిమి వాటిని జగన్ తన రాజకీయ మైలేజీకి వినియోగించుకోవడం విచారకరమని వాపోయారు.
ప్రైవేటు, వ్యక్తిగత వివాదాలకు కార్పొరేట్ రంగు అద్ది తమ ప్రతిష్ఠను దెబ్బతీసి అక్రమంగా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నమేనని పేర్కొన్నారు. కంపెనీ చట్టంలోని సెక్షన్ 59 కింద జగన్ దాఖలు చేసిన పిటిషన్ వాస్తవంగా కార్పొరేట్ వివాదానికి సంబంధించినది కాదని, అన్నాచెల్లెళ్ల మధ్య రాజకీయ వైరుధ్యాల ఫలితమేనని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com