VIVEKA: వివేకా హత్యపై విజయసాయి సంచలన వ్యాఖ్యలు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై.. వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకానంద రెడ్డి మరణించినప్పుడు తాను వైఎస్ అవినాష్ రెడ్డికి ఫోన్ చేసినట్లు వెల్లడించారు. ఆ సమయంలో తాను ఏం జరిగిందని అవినాష్ ను అడగగా.. అవినాష్ పక్కన వారికి ఫోన్ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ఆ వ్యక్తే వివేకాది గుండెపోటు అని తనకు చెప్పారని.. అదే విషయాన్ని తాను మీడియాకు చెప్పానని వెల్లడించారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామాపై తన నిర్ణయం మారబోదని.. విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. దైవ భక్తుడిగా అబద్దాలు చెప్పలేకే తన పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. వెన్నుపోటు రాజకీయాలు తనకు తెలీవని అన్నారు. ఉపరాష్ట్రపతికి తన రాజీనామాను అందించానని... తన రాజీనామాను ఉపరాష్ట్రపతి ఆమోదించారన్నారని విజయసాయి వెల్లడించారు. తన పిల్లల సాక్షిగా కాకినాడ పోర్ట్ వ్యవహారంతో ఏం సంబంధ లేదన్నారు.
జగన్ వద్దన్నా.. రాజీనామా చేశా
రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను రాజీనామా చెయ్యొద్దని వైఎస్ జగన్ కోరారని.. అయినా తాను రాజీనామా చేశానని విజయసాయి తెలిపారు. తన ప్రాధాన్యాన్ని ఎవరు తగ్గించలేరని స్పష్టం చేశారు. అబద్దాలు చెప్పలేకే తాను రాజీనామా చేసినట్లు విజయసాయి వెల్లడించారు. తన రాజీనామాకు.. కాకినాడ పోర్టు కేసుకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఎంపీ పదవికి రాజీనామా
రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ కు రాజీనామా పత్రాన్ని అందజేశారు. రాజీనామా లేఖ సమర్పణకు ముందు విజయసాయితో వైసీపీ ఎంపీ గురుమూర్తి చర్చలు జరిపారు. అయినా వెనక్కి తగ్గని విజయసాయి.. రాజ్యసభకు చేరుకుని చైర్మన్ ధన్ ఖడ్ కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు.
వైసీపీ సభ్యత్వానికీ రాజీనామా
పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానన్న విజయసాయిరెడ్డి... వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశానని విజయసాయి రెడ్డి చెప్పారు. చంద్రబాబుతో తనకు విభేదాలు లేవనడం, పవన్ తో చిరకాల స్నేహం ఉందనడంతో విజయసాయి కూటమికి దగ్గరవుతారనే చర్చ జరుగుతోంది. తనను ప్రోత్సహించారంటూ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ధన్యవాదాలు చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com